Per Capita Income Growth: ఏపీ, తెలంగాణలో తలసరి ఆదాయాల పెరుగుదల
ABN , Publish Date - Jul 22 , 2025 | 06:49 AM
ఆంధ్రప్రదేశ్‌లో నికర దేశీయోత్పత్తి ఆదాయం గత పదేళ్లలో 78.9 శాతం, తెలంగాణలో 85.3 శాతం పెరిగిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు.

న్యూఢిల్లీ, జూలై 21 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో నికర దేశీయోత్పత్తి ఆదాయం గత పదేళ్లలో 78.9 శాతం, తెలంగాణలో 85.3 శాతం పెరిగిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. సోమవారం లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ 2013-14లో ఏపీలో నికర దేశీయోత్పత్తి రూ.79174 కాగా 2024-25లో అది రూ. 1,41,609కు చేరుకుందని ఆయన తెలిపారు. కాగా, 2023-24లో ఏపీలో నికర దేశీయోత్పత్తి రూ.1,31,083 కాగా అది ఏడాదిలోనే రూ. పదివేలకు పైగా పెరిగి 1,41,609కి చేరుకోవడం గమనార్హం. ఇక తెలంగాణలో 2023-24లో నికర దేశీయోత్పత్తి రూ. 1,77,000 కాగా, అది 2024-25లో రూ.పదివేలకు పైగా పెరిగి రూ. 1,87,912కు చేరుకుంది. గత పదేళ్లలో తెలంగాణలో నికర దేశీయోత్పత్తి 85.3 శాతం పెరిగిందని చెప్పారు.