Share News

పాల్‌ పార్టీ ఎంతో... వైసీపీ అంతే..!: అచ్చెన్న

ABN , Publish Date - Jul 20 , 2025 | 04:22 AM

రాష్ట్రంలో ఏదో ఒక రూపంలో అలజడి సృష్టించడానికి జగన్‌ పూనుకున్నారు. దీన్ని అడ్డుకుని తీరుతాం. ఆయన ఆటలు సాగనివ్వం అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

 పాల్‌ పార్టీ ఎంతో... వైసీపీ అంతే..!: అచ్చెన్న

టెక్కలి, జూలై 19(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో ఏదో ఒక రూపంలో అలజడి సృష్టించడానికి జగన్‌ పూనుకున్నారు. దీన్ని అడ్డుకుని తీరుతాం. ఆయన ఆటలు సాగనివ్వం’ అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం రాత్రి శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘జగన్‌ మాట్లాడితే తాను ప్రతిపక్ష నాయకుడ్ని అని చెబుతున్నారు. రాష్ట్ర ప్రజలు ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. రాష్ట్రంలో పాల్‌ పార్టీ ఎంతో వైసీపీ కూడా అంతే. వైసీపీ నాయకులు అమరావతిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. వైసీపీ పాలనలో ఎస్సీ, బీసీలను ఊచకోత కోశారు. దళితుల్ని చంపి డోర్‌ డెలివరీ చేశారు. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు సీఎం చంద్రబాబు నాయకత్వంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. ఇందులో రూ.6 లక్షల కోట్లకు ఎంవోయూలు జరిగాయి’ అని అచ్చెన్న పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తాడిపత్రిలో టెన్షన్‌ టెన్షన్‌

ప్రభుత్వ బడుల్లో నో వేకెన్సీ పరిస్థితి తేవాలి

Read latest AP News And Telugu News

Updated Date - Jul 20 , 2025 | 04:23 AM