Muslim Unity Forum: ముస్లింలకు అట్రాసిటీ చట్టం తీసుకురావాలి
ABN , Publish Date - Oct 20 , 2025 | 05:56 AM
ముస్లింల భద్రత కోసం ప్రత్యేక అట్రాసిటీ చట్టాన్ని రూపొందించాలని ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సాలాఉద్దీన్ కోరారు.
ముస్లిం సమైక్య వేదిక
మంగళగిరి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ముస్లింల భద్రత కోసం ప్రత్యేక అట్రాసిటీ చట్టాన్ని రూపొందించాలని ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అఽధ్యక్షుడు సాలాఉద్దీన్ కోరారు. మంగళగిరి ఈద్గా ఫంక్షన్‌హాలులో ఆదివారం జరిగిన ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముస్లింలపై జరుగుతున్న దాడులు, వివక్షను అడ్డుకోవాలంటే ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం మాదిరి ప్రత్యేక చట్టాన్ని తేవాల్సిందేనన్నారు. విద్య, ఆర్థిక రంగాల్లో ముస్లింలకు మరింత ప్రాధాన్యతను ఇచ్చేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.