Share News

MP Harish Madhur: 11 రోజుల్లో.. 6 దేశాలు తిరిగాం

ABN , Publish Date - Jun 18 , 2025 | 06:10 AM

పాకిస్థాన్‌ ఉగ్రవాద కార్యకలాపాలపై ప్రపంచ దేశాలకు తెలియజేసి, ఆపరేషన్‌ సిందూర్‌కు వారి మద్దతు కూడగట్టేందుకు 11 రోజులపాటు ఆరు దేశాల్లో పర్యటించామని...

 MP Harish Madhur: 11 రోజుల్లో.. 6 దేశాలు తిరిగాం

  • పాక్‌ కుతంత్రాలను ప్రపంచానికి చాటాం

  • ఉగ్రవాదం అంతానికి ఆయా దేశాల మద్దతు: ఎంపీ హరీష్‌

అమలాపురం, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): పాకిస్థాన్‌ ఉగ్రవాద కార్యకలాపాలపై ప్రపంచ దేశాలకు తెలియజేసి, ఆపరేషన్‌ సిందూర్‌కు వారి మద్దతు కూడగట్టేందుకు 11 రోజులపాటు ఆరు దేశాల్లో పర్యటించామని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్‌ తెలిపారు. మే 25 నుంచి జూన్‌ 5 వరకు వివిధ దేశాల్లో పర్యటించామని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో మంగళవారం విలేకరుల సమావేశంలో చెప్పారు. ఎంపీ శశిథరూర్‌ నేతృత్వంలోని తమ ఎంపీల బృందం అమెరికా, పనామా, డయానా, బ్రెజిల్‌, కొలంబియా దేశాల్లో పర్యటించిందని, ఉగ్రవాదం అంతానికి భారత్‌ తీసుకున్న చర్యలకు ఆయా దేశాలు మద్దతు తెలిపాయన్నారు. తమకు ప్రవాస భారతీయులు అపూర్వ స్వాగతం పలికారని తెలిపారు. పర్యటన తర్వాత ఢిల్లీలో ప్రధాని మోదీ ఏర్పాటుచేసిన విందులో పాల్గొన్నామని, పర్యటన విశేషాలు తెలుసుకుని ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారని హరీష్‌ చెప్పారు.

Updated Date - Jun 18 , 2025 | 06:12 AM