Kuppam Missing Man: కుప్పంలో దారుణం.. హత్య చేసి ఇంట్లోనే పూడ్చి..
ABN , Publish Date - Nov 16 , 2025 | 12:45 PM
చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఓ వ్యక్తి మరో వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. అనంతరం శవాన్ని ఇంట్లోనే పూడ్చి వేశాడు.
చిత్తూరు: ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలకు ఓ నిండు ప్రాణం బలైంది. ఓ వ్యక్తి మరో వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనంతరం శవాన్ని ఇంట్లోనే పూడ్చేశాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పంలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కుప్పం మున్సిపాలిటీలోని అమరావతి కాలనీకి చెందిన శ్రీనాథ్ గత నెల 27వ తేదీనుంచి కనిపించకుండా పోయాడు. ఎంత వెతికినా శ్రీనాథ్ కనిపించకపోవటంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. శ్రీనాథ్ కనిపించటంలేదంటూ ఫిర్యాదు చేశారు.
మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆర్థిక లావాదేవీల కారణంగా శ్రీనాథ్‌ను ప్రభాకర్ అనే వ్యక్తి హత్య చేసినట్లు సమాచారం. శ్రీనాథ్‌ను చంపి ఇంట్లోనే పాతి పెట్టినట్లు పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. గతంలో సైతం ప్రభాకర్‌పై హత్య కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. హత్య కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
ముదిరిన పచ్చిమిరపకాయలకు చిల్లులు పెట్టి...
శీతాకాలంలో చుండ్రు పెరుగుతుందా? ఇలా చేయండి.!