Share News

Minor Girl Sold: ఎన్టీఆర్ జిల్లాలో దారుణం.. కూతుర్ని అమ్మేసిన తండ్రి..

ABN , Publish Date - Nov 18 , 2025 | 12:03 PM

ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. 20 లక్షల రూపాయల డబ్బుకోసం కన్న కూతుర్ని అమ్మేశాడు. 43 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేశాడు. ఈ సంఘటన ఎన్టీఆర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది.

Minor Girl Sold: ఎన్టీఆర్ జిల్లాలో దారుణం.. కూతుర్ని అమ్మేసిన తండ్రి..
Minor Girl Sold

కన్న బిడ్డను ప్రాణానికి ప్రాణంగా చూసుకోవాల్సిన ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. డబ్బుల కోసం ఘాతుకానికి పాల్పడ్డాడు. మైనర్ కూతుర్ని 20 లక్షల రూపాయలకు అమ్మేశాడు. కూతురికంటే 30 ఏళ్లు పెద్దవాడైన వ్యక్తికిచ్చి పెళ్లి చేశాడు. చివరకు పాపం పండి ఆ కన్నతండ్రి, పెళ్లికొడుకు జైలు పాలయ్యారు. ఈ సంఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మైలవరం మండలం గణపవరానికి చెందిన ఓ వ్యక్తి డబ్బు కోసం గడ్డి తిన్నాడు. ఏ తండ్రీ చేయకూడని పని చేశాడు.


మైనర్ కూతుర్ని 20 లక్షల రూపాయలకు అమ్మేశాడు. కూతురిని ఆమెకంటే 30 ఏళ్లు పెద్దవాడైన వ్యక్తికిచ్చి పెళ్లి చేశాడు. భర్తతో ఉండలేకపోయిన మైనర్ బాలిక పుట్టింటికి వచ్చింది. అప్పటినుంచి కాపురానికి వెళ్లటం లేదు. తండ్రి ఎంత చెప్పి చూసినా ఆమె వినలేదు. దీంతో ఓ నీచమైన పనికి పూనుకున్నాడు. కూతురికి మద్యం అలవాటు చేశాడు. మైనర్ బాలిక పెళ్లి గురించి పోలీసులకు సమాచారం వెళ్లింది. పోలీసులు బాలిక తండ్రి, భర్తపై పోక్సో కింద కేసు నమోదు చేశారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


ఇవి కూడా చదవండి

ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్.. పేలుడుకు ముందు వీడియో రికార్డ్ చేసిన ఉమర్

షాకింగ్.. సిక్స్ ప్యాక్ కోసం పిచ్చి పని.. చైనా వ్యక్తి ఏం చేశాడంటే..

Updated Date - Nov 18 , 2025 | 12:41 PM