Share News

Minister Satya Kumar: ఏఎంఆర్‌ పై వైద్యులు దృష్టి సారించాలి

ABN , Publish Date - Jul 05 , 2025 | 06:06 AM

ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్న యాంటీ మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌ సమస్యను అధిగమించడంలో వైద్యులు కీలక పాత్ర పోషించాలని, దీనిపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు.

Minister Satya Kumar: ఏఎంఆర్‌ పై వైద్యులు దృష్టి సారించాలి

  • మంత్రి సత్యకుమార్‌

  • 20న గుంటూరులో ఏఎంఆర్‌పై రాష్ట్రస్థాయి సదస్సు

గుంటూరు మెడికల్‌, జూలై 4(ఆంధ్రజ్యోతి): ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్న యాంటీ మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌ సమస్యను అధిగమించడంలో వైద్యులు కీలక పాత్ర పోషించాలని, దీనిపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు. ఏఎంఆర్‌పై వైద్యులకు శాస్ర్తీయ అవగాహన కోసం నిర్వహిస్తున్న నిరంతర వైద్య విద్యా సదస్సు పోస్టర్‌ను మంత్రి శుక్రవారం విజయవాడలోని ఎన్టీఆర్‌ వర్సిటీలో ఆవిష్కరించారు. ఐఎంఏ రాష్ట్ర శాఖ, క్లినికల్‌ ఇన్ఫెక్షన్‌ డిసీజెస్‌ సొసైటీ (సీఐడీఎస్‌) గుంటూరు శాఖల సంయుక్తంగా జరిగిన ఈ సదస్సులో మంత్రి మాట్లాడుతూ ఏఎంఆర్‌పై తొలిసారిగా గుంటూరులో త్వరలో రాష్ట్ట్రస్థాయి సదస్సు నిర్వహించనుండటం అభినందనీయమన్నారు. ఏఎంఆర్‌పై శాస్ర్తీయ అవగాహన కలిగించేందుకే ఈనెల 20నగుంటూరు వైద్య కళాశాలలో ఒకరోజు రాష్ట్రస్థాయి సదస్సును నిర్వహిస్తున్నట్లు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ నందకిశోర్‌ తెలిపారు. అనంతరం యాంటీ మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌పై అధికారులతో కలిసి మంత్రి పోస్టరు విడుదల చేశారు. సీఐడీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.కళ్యాణ్‌ చక్రవర్తి, ఏంఎసీ చైర్మన్‌ డాక్టర్‌ డి.శ్రీహరి రావు, డీఎంఈ డాక్టర్‌ నరసింహం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2025 | 06:07 AM