వైన్ షాపులో వ్యక్తి మృతి
ABN , Publish Date - Aug 04 , 2025 | 12:00 AM
కోడుమూరుకు చెందిన రామాంజనేయులు (38) అనే వ్యక్తి ఓ వైన్ షాపులో మద్యం తాగి మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది.

మృతదేహాన్ని బయట పడేసిన నిర్వాహకులు
కోడుమూరు, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): కోడుమూరుకు చెందిన రామాంజనేయులు (38) అనే వ్యక్తి ఓ వైన్ షాపులో మద్యం తాగి మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. పట్టణంలోని శ్రీలక్ష్మీ వైన్స్ షాపు నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పర్మిమిట్ రూములను ఏర్పాటు చేశారు. రామాంజేయులు అనే వ్యక్తి వైన్ షాపులో మందు తీసుకొని అనధికారికంగా ఏర్పాటు చేసిన పర్మిమిట్ రూంలో మందు తాగాడు. మందు తాగిన కొద్ది సేపటికే కుప్పకూలాడు. రామాంజనేయులు మృతి చెందినట్లు నిర్ధారించుకున్న నిర్వాహకులు మృతదేహాన్ని తీసుకొచ్చి పక్కనే మరో షాపు ముందు పడేశారు. తమకు ఏమి సంబంధం లేనట్టు ఉండిపోయారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. తాగుడుకు బానిస కావడం వలన మృతుడికి పెళ్లి కాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.