Share News

Minister Gottipati:154 సీట్లిస్తే జగన్‌ ప్యాలెస్‌ దాటలేదు

ABN , Publish Date - Jul 12 , 2025 | 05:25 AM

జగన్‌కు 154 సీట్లిస్తే తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమైపోయి ప్రజల్లోకి రాకుండా ఐదేళ్లు పరదాల చాటు సీఎంగా ఉండిపోయాడు. ఇప్పుడు ప్రజలు 11 సీట్లు ఇవ్వగానే జగన్‌ రోడ్లపైకి వచ్చి పరామర్శల పేరుతో...

Minister Gottipati:154 సీట్లిస్తే జగన్‌ ప్యాలెస్‌ దాటలేదు

  • 11 ఇస్తే... పరామర్శలంటూ గ్రామాల్లోకి వచ్చాడు: గొట్టిపాటి

త్రిపురాంతకం, జూలై 11(ఆంధ్రజ్యోతి): ‘జగన్‌కు 154 సీట్లిస్తే తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమైపోయి ప్రజల్లోకి రాకుండా ఐదేళ్లు పరదాల చాటు సీఎంగా ఉండిపోయాడు. ఇప్పుడు ప్రజలు 11 సీట్లు ఇవ్వగానే జగన్‌ రోడ్లపైకి వచ్చి పరామర్శల పేరుతో రోజుకో గ్రామం తిరుగుతున్నాడు. అందుకే 2029 ఎన్నికల్లో ఆ సీట్ల సంఖ్య జీరో చేస్తే నిత్యం ప్రజల మధ్యే తిరుగుతాడు’ అని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలోని ఐటీవరంలో 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం సభలో మంత్రి మాట్లాడారు. కార్యక్రమంలో కనిగిరి, గిద్దలూరు ఎమ్మెల్యేలు ఉగ్రనరసింహారెడ్డి, అశోక్‌రెడ్డి, యర్రగొండపాలెం, దర్శి టీడీపీ ఇన్‌చార్జులు ఎరిక్షన్‌బాబు, గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Jul 12 , 2025 | 11:50 AM