Share News

జగన్‌ మీడియాను బహిష్కరించాలి: టీజీ భరత్‌

ABN , Publish Date - Jul 11 , 2025 | 05:00 AM

మహిళలపై వైసీపీ నాయకులు కించపరిచేలా మాట్లాడుతున్నా.. వారి మాటలను సమర్థించేలా జగన్‌ పత్రిక, టీవీ చానెల్‌లో కథనాలు రావడం బాధాకరమని, ఆ మీడియాను...

జగన్‌ మీడియాను బహిష్కరించాలి: టీజీ భరత్‌

కర్నూలు అర్బన్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): మహిళలపై వైసీపీ నాయకులు కించపరిచేలా మాట్లాడుతున్నా.. వారి మాటలను సమర్థించేలా జగన్‌ పత్రిక, టీవీ చానెల్‌లో కథనాలు రావడం బాధాకరమని, ఆ మీడియాను ప్రజలు బహిష్కరించాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ పిలుపునిచ్చారు. గురువారం కర్నూలు నగరంలోని 13 డివిజన్‌లో ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిపై వైసీపీ నాయకుడు ప్రసన్నకుమార్‌ రెడ్డి చేసిన అనుచిత వాఖ్యలు వైసీపీ నీచ సంస్కృతికి అద్దం పడుతున్నాయన్నారు.

Updated Date - Jul 11 , 2025 | 05:01 AM