ISROs Baahubali Rocket: బాహుబలి రాకెట్ ప్రయోగం సక్సెస్.. 16 నిమిషాల్లోనే..
ABN , Publish Date - Nov 02 , 2025 | 05:45 PM
ఇస్రో శాస్త్రవేత్తలు LVM3-M5 రాకెట్‌ను సక్సెస్‌ఫుల్‌గా నింగిలోకి ప్రయోగించారు. ఆదివారం సాయంత్రం 5.26 నిమిషాలకు రాకెట్ నింగిలోకి నిప్పులు చిమ్ముకుంటూ ఎగిరింది.
బహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీహరి కోట నుంచి LVM3-M5 రాకెట్‌ను సక్సెస్‌ఫుల్‌గా నింగిలోకి ప్రయోగించారు. ఆదివారం సాయంత్రం 5.26 నిమిషాలకు రాకెట్ నింగిలోకి నిప్పులు చిమ్ముకుంటూ ఎగిరింది. ఈ LVM3-M5 రాకెట్ CMS-3 ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. 16 నిమిషాల 09 సెకన్లలోనే CMS-3 ఉపగ్రహం కక్ష్యలోకి ప్రవేశించింది. కాగా, ఇస్రో ప్రవేశపెట్టిన ఉపగ్రహాల్లో CMS-3 అతిపెద్దది కావటం విశేషం.
ఈ ఉపగ్రహం బరువు 4,410 కిలోలు. CMS-3 ఉపగ్రహం భారత్‌కు సమాచార సేవలు అందించనుంది. ఈ ఉపగ్రహం ద్వారా సమాచార వ్యవస్థ మెరుగుపడడంతోపాటు సముద్ర వాతావరణ పరిస్థితులను తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఇక, కౌంట్ డౌన్ ప్రారంభానికి ముందు ఇస్రో చైర్మన్ వీ నారాయణ, షార్ డైరెక్టర్ పద్మ కుమార్‌లు రాకెట్ నమూనాలకు తిరుమల శ్రీవారి ఆలయంలో.. శ్రీకాళహస్తిలోని స్వామి వారి సన్నిధిలో.. సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి
కాలేయ ఆరోగ్యం కోసం 3 బెస్ట్ డ్రింక్స్ ఇవే..
విశాఖలో డ్రగ్స్ కలకలం.. అడ్డంగా దొరికిన వైసీపీ డ్రగ్స్ దొంగలు