పట్టుపట్టి... కొలువు కొట్టి..!
ABN , Publish Date - Aug 01 , 2025 | 11:30 PM
ఇటీవల నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్షల ఫలితాలు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

కానిస్టేబుల్ ఫలితాలు విడుదల
ఉమ్మడి జిల్లాలో 281 మంది ఎంపిక
కర్నూలు క్రైం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): ఇటీవల నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్షల ఫలితాలు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 285 పోస్టులకు నోటిఫికేషన విడుదల చేశారు. 2022 జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల్లో 281 మంది అభ్యర్థులు సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికయ్యారు. ఒక్క గోనెగండ్ల మండలంలోనే 16 మంది అభ్యర్థులు, కోసిగిలో 14 మంది అభ్యర్థులు అత్యధికంగా ఈ పోస్టులకు ఎంపిక కావడం విశేషం. అలాగే కర్నూలు డయల్ 100 విభాగంలో పని చేస్తున్న ఇద్దరు హోంగార్డులు బాలకృష్ణ, మస్తాన, మహేంద్ర సివిల్ కానిస్టేబుల్స్‌కు ఎంపికయ్యారు. కర్నూలు జిల్లాలో కోసిగికి చెందిన దుర్నిగేని శ్రీరాములు 159 మార్కులు సాధింటి టాపర్‌గా నిలిచాడు. అదేవిధంగా రవికుమార్ 151 మార్కులు, గోవిందు 145, లిఖిత 141 మార్కులు, నాయక్ 137 మార్కులు, విజయ్ 140 మార్కులు సాధించారు.