Share News

నాలుగు నెలల్లో హైకోర్టు బెంచ

ABN , Publish Date - Aug 03 , 2025 | 11:50 PM

సుప్రీం కోర్టు నుంచి క్లియరెన్స రాగానే నాలుగు నెలల్లో హైకోర్టు బెంచను ఏర్పాటు చేస్తామని, ఆ దిశగా సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత స్పష్టం చేశారు.

నాలుగు నెలల్లో హైకోర్టు బెంచ
మాట్లాడుతున్న మంత్రి టీజీ భరత

ఓర్వకల్లులో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు

ఐదేళ్లు వైసీపీ విధ్వంసం చేస్తే.. చంద్రబాబు సరి చేస్తున్నారు

అత్యున్నత పారిశ్రామిక పాలసీ కోసం రూపకల్పన

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత

కర్నూలు, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): సుప్రీం కోర్టు నుంచి క్లియరెన్స రాగానే నాలుగు నెలల్లో హైకోర్టు బెంచను ఏర్పాటు చేస్తామని, ఆ దిశగా సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత స్పష్టం చేశారు. ఆదివారం కర్నూలులోని మౌర్యఇనలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు, సింగపూర్‌ పర్యటన సక్సెస్‌, రాయలసీమ ప్రాజెక్టులు, జిల్లాలో పారిశ్రామిక పెట్టుబడులు.. వంటి అంశాలను వివరించారు. అదే క్రమంలో గత ఐదేళ్లు రాష్ట్రాన్ని వైసీపీ ఏ రీతిన విధ్వంసం, వినాశనం చేసిందో ఘాటుగా స్పందించారు. జిల్లాకు చెందిన వ్యక్తిగా ఈ జిల్లాకు ఎక్కువ పెట్టుబడులు రాబట్టేందుకు మంత్రిగా తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఏడాదిలో ఓర్వకల్లు ఇండసి్ట్రయల్‌ పార్క్‌లో రూ.10 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు మందుకు వచ్చాయన్నారు. దేశంలోనే దిగ్గజ సంస్థ రిలయన్స ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం తమ ప్రభుత్వం సాధించిన ఘనతగా వివరించారు. కర్నూలు విమానాశ్రయంలో రెండు పైలెట్‌ శిక్షణ సంస్థలు రాబోతున్నాయని, పైలెట్‌ శిక్షణ పూర్తి చేస్తే రూ.లక్షల్లో ఉద్యోగాలు వస్తాయన్నారు. ఓర్వకల్లు ఇండసి్ట్రయల్‌ నోడ్‌ రూ.2,850 కోట్లులో అభివృద్ధి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం నీటి సౌకర్యం కల్పించే పైపులైన కూడా వేయకపోతే మన ప్రభుత్వం వచ్చాక 90 శాతం పూర్తి చేశామన్నారు. పశ్చిమ ప్రాంతంలో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే కరువు, వలసలు నివారించవచ్చని, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. పత్తికొండ టమోటా ప్రాసెసింగ్‌ యూనిట్‌ను తన హయాంలో పనులు మొదలు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. హంద్రీనీవా కాలువను 120 రోజుల్లో 3,850 క్యూసెక్కులకు విస్తరించి రికార్డు సృష్టించామని తెలిపారు.

ఫ ప్రభుత్వం మారడంతో భారీ నష్టం

దేశంలో గుజరాత రాష్ట్రం అగ్రస్థానంలో ఉండడానికి కారణం అక్కడ సుదీర్ఘంగా ఒకే ప్రభుత్వం కొనసాగడమేని మంత్రి టీజీ భరత అన్నారు. ‘రాష్ట్ర విభజన తరువాత 2014-19 మధ్య సీఎం చంద్రబాబు ఏపీ ఓ స్థాయికి తీసుకెళ్లాడు. టీడీపీ ప్రభుత్వం మళ్లీ వచ్చి ఉంటే ఏపీ అగ్రస్థానంలో ఉండేది.. దురదృష్టవశాత్తు వచ్చిన వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేయడంతో పెట్టుబడులు పెట్టేందుకు భయపడే పరిస్థితి ఏర్పడింది’ అన్నారు. కూటమి ప్రభుత్వం మళ్లీ రావడంతో వైసీపీ చేసిన విధ్వంసాన్ని సీఎం చంద్రబాబు సరి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నాడని తెలిపారు. ఉమ్మడి ఏపీలో 1999లో రెండవ పర్యాయం టీడీపీ ప్రభుత్వం రాకపోయి ఉంటే హైదరాబాద్‌కు హైటెక్‌ సిటీ, రింగ్‌ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చేదా..? అని ప్రశ్నించారు. తమిళనాడు తరహాలో రాష్ట్రాభివృద్ధి కోసం ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. వైసీపీ తన విధానాలు మార్చుకోకపోతే రాబోయే ఎన్నికల్లో ఒక సీటుకే పరిమితం కావాల్సి వస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలో మంత్రులు నారా లోకేశ, నారాయణలతో కలసి ఐదు రోజుల సింగపూర్‌ పర్యటన సూపర్‌ సక్సెస్‌ అయ్యిందని మంత్రి టీజీ భరత వివరించారు.

ఫ ప్రజల్లో రెట్టింపు సంతృప్తి

ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మంత్రి టీజీ భరత అన్నారు. ‘ఏడాదిలోనే వృద్ధుల పింఛన రూ.4 వేలు వికలాంగుల పింఛన రూ.6 వేలకు పెంచాం. ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, అన్న క్యాంటీన్లు పునఃప్రారంభం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను విజయవంతంగా అమలు చేశాం. ఈ నెల 7న చేనేతలకు ఉచిత విద్యుత, 15 నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలు చేయబోతున్నాం..’ అని అన్నారు. సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఏ ఇంటికి వెళ్లినా చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వంపై రెట్టింపు సంతృప్తి, ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారన్నారు. టిడ్కో గృహాలను కూడా పేదలకు త్వరలోనే అందజేస్తామని తెలిపారు.

Updated Date - Aug 03 , 2025 | 11:50 PM