Eluru District: స్వల్పంగా తగ్గిన గోదావరి
ABN , Publish Date - Jul 14 , 2025 | 04:56 AM
ఏలూరు జిల్లా పోలవరంలో గోదావరి వరద శాంతించింది. దీంతో పునరావాస కేంద్రాలకు చేరుకున్న ముంపు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

పోలవరం నుంచి 7 లక్షల క్యూసెక్కులు విడుదల
పోలవరం, ధవళేశ్వరం, యలమంచిలి, జూలై 13(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా పోలవరంలో గోదావరి వరద శాంతించింది. దీంతో పునరావాస కేంద్రాలకు చేరుకున్న ముంపు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. భద్రాచలం వద్ద ఆదివారం ఉదయం 41.30 అడుగులు నమోదవగా, సాయంత్రానికి 30.60 అడుగులకు చేరింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేలోకి చేరుకున్న 7,29,590 క్యూసెక్కుల అదనపు జలాలను అధికారులు దిగువకు విడుదల చేశారు. పట్టిసీమ శివక్షేత్రం చుట్టూ వరద చుట్టుముట్టింది. లంక భూములు నీటమునిగాయి. కడెమ్మ స్లూయీజ్ వద్ద గేట్లు మూసివేయడంతో వరద స్లూయీజ్ గేట్లను ముంచెత్తింది. ధవళేశ్వరం వద్ద ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిలకడగా కొనసాగి ఆపై తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 10.90 అడుగులుగా నమోదైంది. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలంలోని కనకాయలంక కాజ్ వేపై అడుగు మేర వరదనీరు ప్రవహిస్తోంది.