Tippala Nagi Reddy: కన్నీరు పెట్టుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి
ABN , Publish Date - Apr 17 , 2025 | 09:28 PM
గాజువాక వైసీపీ మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కంటనీరు కార్చారు. తన పెద్ద కుమారుడు వంశీరెడ్డి జనసేన పార్టీలో చేరడాన్ని ఆయన ఏమాత్రం జీర్ణించుకోలేకున్నారు.

Tippala Nagi Reddy: గాజువాక వైసీపీ మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కన్నీరు పెట్టుకున్నారు.ఇవాళ విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తన పెద్ద కుమారుడు వంశీరెడ్డి జనసేన పార్టీలో చేరడాన్ని జీర్ణించుకోలేక పోతున్నానని వ్యాఖ్యానిస్తూ శోకాలు పెట్టారు. వైసీపీ కార్పొరేటర్ గా గెలిచి.. నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేనలో తన తనయుడు వంశీ రెడ్డి చేరికపై తిప్పల నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. "తండ్రి మాటను కాదని వేరే పార్టీలో చేరడం బాధనిపించింది. వైసీపీలో సముచితస్థానం, అనేక పదవులు పొందిన నా పెద్ద కుమారుడు వంశీరెడ్డి నా మాటను సైతం లెక్క చేయకుండా జనసేనలో చేరడం సరికాదు. తొలి నుంచీ వంశీ వ్యవహార శైలి నాకు నచ్చలేదు, అయినప్పటికీ సర్దుకుపోతూ వచ్చాను. పార్టీ మారుతాడని కానీ, ఆ ఆలోచనలు ఉన్నట్టు ఏరోజూ నాకు చెప్పలేదు.ఇంట్లో పెద్ద కుమారుడే ఇలా చేస్తాడని అనుకోలేదు..ఈ చర్య నన్ను ఎంతగానో బాధించింది. వంశీ వెళ్లినంత మాత్రాన వైసీపీకి జరిగే నష్టం ఏమీ లేదు.. గాజువాకలో పార్టీ బలంగానే ఉంది.. మళ్లీ అధికారంలోకి వస్తాము". అని నాగిరెడ్డి అన్నారు.
Also Read:
అలర్ట్! ఆఫీసుల్లో ఉద్యోగులు ఈ 8 మిస్టేక్స్ చేస్తే
భారత్-చైనా కొత్త ఒప్పందం..కైలాష్ యాత్రకు
కాసేపట్లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షం..
For More Telangana News and Telugu News..