రైతు సంక్షేమమే మోదీ ప్రభుత్వ ప్రాధాన్యం: మాధవ్
ABN , Publish Date - Aug 03 , 2025 | 05:21 AM
రైతు సంక్షేమమే నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు.

అమరావతి, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద దేశ వ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.20 వేల కోట్లు వారాణసి నుంచి విడుదల చేయడాన్ని మాధవ్ స్వాగతించారు. గత వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల పాటు రాష్ట్ర రైతులకు బీమా వాటా చెల్లించక పోయినా కేంద్రం సొమ్ము చెల్లించిందని గుర్తు చేశారు.