Eluru Digital Arrest: మహిళా లాయర్ డిజిటల్ అరెస్ట్.. రూ.52 లక్షలు స్వాహా
ABN , Publish Date - Nov 01 , 2025 | 12:53 PM
తెలుగు రాష్ట్రాల్లో మరో డిజిటల్ అరెస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరుకు చెందిన ఒక మహిళా లాయర్ ఈ మోసం బారిన పడింది. డిజిటల్ అరెస్ట్ పేరుతో అంతర్రాష్ట్ర సైబర్ ముఠా ఫోన్ చేసి..
ఏలూరు, సెప్టెంబర్ 1: తెలుగు రాష్ట్రాల్లో మరో డిజిటల్ అరెస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరుకు చెందిన ఒక మహిళా లాయర్ ఈ మోసం బారిన పడింది. డిజిటల్ అరెస్ట్ పేరుతో అంతర్రాష్ట్ర సైబర్ ముఠా ఫోన్ చేసి సదరు మహిళను తీవ్ర బెదిరింపులకు గురిచేసింది.
అమెరికాలో ఉన్న సదరు మహిళా లాయర్ కుమారులు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారంటూ బెదిరింపులకు పాల్పడింది. ఆమె నుంచి రూ.52 లక్షలు కొల్లగొట్టింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు ఏలూరు పోలీసులు రంగంలోకి దిగారు.
ఈ కేసుకు సంబంధించి మూడు పోలీస్ బృందాలు యూపీ, ఢిల్లీ, మహారాష్ట్రలో 8 మందిని అరెస్టు చేశారు. ఈ స్కాం సూత్రధారులు బంగ్లాదేశ్‌కు పారిపోయినట్టు తెలుస్తోంది. ఇదే తరహాలో భారత దేశంలో వీళ్లు మొత్తంగా రూ.100 కోట్లకు పైగా స్వాహా చేసినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద మృతి
Read Latest Telangana News and National News