Share News

Local Body Elections: ఆ స్థానిక సంస్థల పరిధిలో ఎన్నికల కోడ్‌

ABN , Publish Date - Aug 02 , 2025 | 06:24 AM

రాష్ట్రంలో ఈ నెల 10, 12 తేదీల్లో జరగనున్న పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లుపై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ పలు ఉత్తర్వులు జారీ చేసింది.

Local Body Elections: ఆ స్థానిక సంస్థల పరిధిలో ఎన్నికల కోడ్‌

  • ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ’పీఎం కిసాన్‌’ మాత్రమే

  • కోడ్‌ సడలించాకే ’అన్నదాత సుఖీభవ’: ఎన్నికల సంఘం

అమరావతి, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఈ నెల 10, 12 తేదీల్లో జరగనున్న పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లుపై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ పలు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా పంచాయతీలు, మండలాల పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల కోడ్‌ పరిధిలోకి వస్తారని పేర్కొంది. ఎన్నికలు జరిగే ప్రాంతంలో 48 గంటల ముందు ప్రచారం నిలిపేయడం, మద్యం షాపులు మూసేయడంతో పాటు ఎన్నికలు జరిగే రోజుల్లో జిల్లా కలెక్టర్లు ఆయా ప్రాంతాల్లో సెలవులు ప్రకటించాలని ఆదేశించింది. కాగా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌’ కింద కోడ్‌ అమలులో ఉన్నచోట పీఎం కిసాన్‌ నిధులు మాత్రమే విడుదల చేయడానికి అనుమతించింది. కోడ్‌ సడలించిన తర్వాత అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని పేర్కొంది.

Updated Date - Aug 02 , 2025 | 06:24 AM