మట్టి మాఫియా బరితెగింపు!
ABN , Publish Date - Jul 09 , 2025 | 01:44 AM
పెద్దాపురం, జూలై 8 (ఆంధ్రజ్యోతి): అధికారులంటే భయం లేదు... ప్రజలు గమనిస్తారన్న లెక్కేలేదు... రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న ధైర్యమో లేక తమను ఎవరేం చేస్తారన్న ధీమా కాబోలు.... మట్టి మా ఫియా ఆగడాలకు అడ్డు అదుపులేకుండా పోతో ంది. కాకినాడ జిల్లా పెద్దాపురంలో మట్టి మాఫి యా రెచ్చిపోతోంది. పొలాల మెరక పేరుతో రైతు లతో దరఖాస్తు చేయించి అడ్డగోలుగా తవ్వకాలు సాగిస్తున్నారు. 10వేల క్యూ

పంగిడి చెరువులో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
పొలం మెరక చేసుకోవాలని రైతుల పేరుతో దరఖాస్తులు
10వేల క్యూబిక్ మీటర్లకు అనుమతి... తవ్విందిలక్షపైనే
ఇటుక బట్టీలు, రియల్ వెంచర్లకు
ఇతర ప్రాంతాలకు పెద్ద ఎత్తున రవాణా
రూ.లక్షల్లో దోచుకుంటున్న అక్రమార్కులు
పెద్దాపురం, జూలై 8 (ఆంధ్రజ్యోతి): అధికారులంటే భయం లేదు... ప్రజలు గమనిస్తారన్న లెక్కేలేదు... రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న ధైర్యమో లేక తమను ఎవరేం చేస్తారన్న ధీమా కాబోలు.... మట్టి మా ఫియా ఆగడాలకు అడ్డు అదుపులేకుండా పోతో ంది. కాకినాడ జిల్లా పెద్దాపురంలో మట్టి మాఫి యా రెచ్చిపోతోంది. పొలాల మెరక పేరుతో రైతు లతో దరఖాస్తు చేయించి అడ్డగోలుగా తవ్వకాలు సాగిస్తున్నారు. 10వేల క్యూబిక్ మీటర్లకు అను మతి పొంది ఏకంగా లక్ష క్యూబిక్ మీటర్ల పైనే తవ్వేసినట్టు తెలుస్తోంది. నవకాన్ ఇన్‌ఫ్రా పేరుతో ట్రిప్ షీట్లు జారీ చేస్తూ తవ్వకాలు సా గించడంతో మట్టి అక్రమ రవాణా జరుగు తోందన్న అనుమానాలు నిజం అవుతున్నాయి. తరలిస్తున్న మట్టి ప్రధానంగా ఇటుక బట్టీలు, రియల్ వెంచర్ల కోసం పెద్ద ఎత్తున రవాణా చేస్తున్నట్టు సమాచారం. కాకినాడ, పరిసర ప్రాంతాల్లో వెలసిన వెంచర్లకు మట్టిని రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నట్టు పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతుల ప్రయోజనం కోసం ప్ర భుత్వం క్యూబిక్ మీటరు రూపాయి చొప్పున ఇస్తే అక్రమార్కులు అడ్డదారుల్లో మట్టిని తరలించుకు పోతున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వారు అటువైపు కన్నెత్తి చూడట్లే దని పలువురు చెప్తున్నారు. పెద్దాపురం, వాలు తిమ్మాపురం పరిధిలో సుమారు 64 ఎకరాల విస్తీర్ణంలో పంగిడి చెరువు ఉంది. రైతుల పేరుతో కొంతమంది అక్రమార్కులు జలవ నరుల శాఖకు దరఖాస్తు చేయించి మట్టి దందాకు తెరలేపారు. దీంతో జలవనరుల శాఖ అనుమతులు మంజూ రు చేసింది. అక్రమార్కులు రంగప్రవేశం చేసి రాత్రనక, పగలనక మట్టిని టిప్పర్ల సహాయంతో తరలిం చుకుపోతున్నారు. నిబంధనలకు విరు ద్ధంగా తవ్వకాలు సాగిస్తున్నట్టు అధి కారులకు తెలిసినా రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అటువైపు కన్నెత్తి చూడట్లేదు.
పట్టించుకోని అధికారులు...
పొలం మెరక పేరుతో అనుమతి తీసుకుని ప్ర భుత్వ నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య కార్యక లాపాలకు మట్టిని తరలిస్తున్నారు. సాధారణ రైతులు మట్టి కావాలని అడిగితే సవాలక్ష ఆం క్షలు విధించే జలవనరుల శాఖ అధికారులు స్థా నిక నేతల సిఫార్సులతో ఆగమేఘా లపై అనుమతులు మంజూరు చేసేశారు. కాకినాడ, ఉండూరు, కరప, పిఠాపురం తదితర ప్రాంతా లకు మట్టిని తరలించేస్తున్నారు. నిత్యం 200 లారీలు పైబడి మట్టిని రేయింబవళ్లూ ఇబ్బడిముబ్బడిగా తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈతతంగం గత నెల రోజులుగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని పలువురు చెబుతున్నారు.
నిబంధనలకు నీళ్లు...
పంగిడి చెరువులో ఇరిగేషన్ అధికారులు ఒక క్యూబిక్ మీటర్ లోతు వరకే పూడికతీత పేరుతో అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. కానీ 7-8 అడు గులు లోతున చెరువును ఎడాపెడా తవ్వేశారు. పైగా రాత్రి సమయంలో కూడా ఈ తవ్వకాలు సాగిస్తున్నారు. వాస్తవానికి ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకే తవ్వకాలు జరగాల్సి ఉండగా మట్టి మాఫియా మాత్రం దీనిని పూర్తిగా విస్మరించింది. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయని తెలిసినా సరే అధికారులు పట్టించుకోకపోవడంతో వారి తీరుపై పలు అనుమానాలు కలుగుతున్నాయి.
మట్టి తవ్వకాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు
పంగిడి చెరువులో మట్టి తవ్వకాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశా. పొలం మెరక చేసుకు నేందుకు గతంలో జలవనరుల శాఖకు దరఖాస్తు చేసుకున్నా అనుమతి ఇవ్వలేదు. పొలాలు మెరక చేసుకోవ డానికి మట్టి దొరక్క సాధారణ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అధికారులు అక్రమార్కులకే ముందు అనుమతులు మంజూరు చేస్తున్నారు. మట్టి అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి.
జి.లక్ష్మణరావు, రైతు, పెద్దాపురం