Share News

విపత్తులను ఎదుర్కొందాం

ABN , Publish Date - May 17 , 2025 | 01:34 AM

కలెక్టరేట్‌ (కాకినాడ), మే 16 (ఆంధ్రజ్యోతి): అనుకోని విపత్తులు సంభ వించినప్పుడు ఎదు ర్కొనేందుకు ఉద్యోగులు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు కాకినాడ జిల్లా కలెక్టరేట్‌లో శుక్ర వారం మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. అగ్నిమాపక, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, పోలీసులు, వైద్య-ఆరోగ్య, విద్యుత్‌ శాఖల అధికారులు పాల్గొన్నారు. సహాయక చర్యల్లో భాగంగా మెట్లు, నిచ్చెనల ద్వారా గాయ పడిన వారిని తీసుకువచ్చి తాత్కాలిక వైద్య శిబి రంలో ప్రథమ చికిత్స అందించి

విపత్తులను ఎదుర్కొందాం
మాక్‌ డ్రిల్‌ను పర్యవేక్షిస్తున్న జేసీ రాహుల్‌ మీనా

కాకినాడలో మాక్‌ డ్రిల్‌

ప్రమాద పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించిన అధికారులు

కలెక్టరేట్‌ (కాకినాడ), మే 16 (ఆంధ్రజ్యోతి): అనుకోని విపత్తులు సంభ వించినప్పుడు ఎదు ర్కొనేందుకు ఉద్యోగులు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు కాకినాడ జిల్లా కలెక్టరేట్‌లో శుక్ర వారం మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. అగ్నిమాపక, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, పోలీసులు, వైద్య-ఆరోగ్య, విద్యుత్‌ శాఖల అధికారులు పాల్గొన్నారు. సహాయక చర్యల్లో భాగంగా మెట్లు, నిచ్చెనల ద్వారా గాయ పడిన వారిని తీసుకువచ్చి తాత్కాలిక వైద్య శిబి రంలో ప్రథమ చికిత్స అందించి వెంటనే అంబు లెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సీపీఆర్‌, అత్యవ సర వైద్యం అందించడంపై అవగాహన కల్పిం చారు. కలెక్టరేట్‌ పై అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించినట్టు చూపించి నిచ్చెన ఆసరాగా భవనం పైకి విపత్తు స్పందన సిబ్బంది చేరు కుని ప్రమాదంలో చిక్కుకున్న వారిని కిందికి తీసుకొచ్చి వైద్య సహాయం అందించేందుకు 108 వాహనాల ద్వారా ఆసుపత్రికి తరలించడం వంటి అంశాలను కళ్లకు కట్టినట్టు చూపించారు. వీటిని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌ మీనా స్వయంగా పర్యవేక్షించారు. కలెక్టరేట్‌ ఆవరణలో ని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ భవనంలో కొంత భాగం కూలినట్టు చూపించి అందులో చిక్కు కున్న వారిని ఎలా కాపాడాలో వివరించారు. భ వనం కూలిపోయిన తర్వాత అందులో ఎంత మంది చిక్కుకున్నారో తెలుసుకునేందుకు కెమెరా లు వినియోగించారు. చిక్కుకున్న వారిని శబ్ధాల ద్వారా గ్రహించి రక్షించేందుకు గోడను కట్టర్ల ద్వారా కట్‌ చేసి దాని ద్వారా భవనంలోకి ప్రవే శించి లోపల ఉన్నవారిని స్ట్రెచర్లపై తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న వారికి సీపీఆర్‌ చేసి అంబులెన్సుల్లో ఆసుపత్రికి తరలించారు.

మాక్‌ డ్రిల్స్‌తో ప్రజల అప్రమత్తం : జేసీ

ఈ సందర్భంగా జేసీ రాహుల్‌ మీనా మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమా దాలు, వరదలు వంటి సంక్షోభాలను ఎదుర్కో వడంతో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు మాక్‌ డ్రిల్స్‌ ఉపయోగ పడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంక ట్రావు, 3వ బెటాలియన్‌ ఎస్‌డీఆర్‌ఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండర్‌ మోహన్‌ రావు, జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌ రాజేష్‌, డీఈవోసీ నోడల్‌ అధికారి భారతి, సమాచార పౌర సంబం ధాల శాఖ డీడీ నాగార్జున, డీపీవో రవికుమార్‌, కలెక్టరేట్‌ పరిపాలనాధికారి రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2025 | 01:34 AM