Share News

లైంగిక వేధింపులు నిజమే..

ABN , Publish Date - Jul 12 , 2025 | 01:06 AM

‘‘ఏయ్‌..ఒక్కడినే వెళ్తున్నా...కారులో వస్తావా...ఏంటీ సరిగ్గా డ్యూటీ చేయడం లేదు.. ఆరోజు ఏకాంతంగా కలుద్దామా...ఈ మధ్య బాడీ వెయిట్‌ పెరిగిపోతోంది..రూంలోకి వెళ్దామా..అన్నీ చూసుకుంటా..’’ అంటూ భుజాల మీద చేతులు వేయడం..అక్కడి నుంచి నడుంపైన.. తోడలను తాకడం..ఎవరైనా పేషెంట్లు చూసి మందలిస్తే వారిపైనా అరవడం...ఇలా ఒకటేంటి రకరకాల వెకిలి చేష్టలతో లైంగిక వేధింపులకు పాల్పడడం జీజీహెచ్‌లో బయోకెమిస్త్రీ ల్యాబ్‌

లైంగిక వేధింపులు నిజమే..

జీజీహెచ్‌ విద్యార్థినులతో ల్యాబ్‌ టెక్నీషియన్‌ తరచూ అసభ్య ప్రవర్తనే

విద్యార్థినులను లైంగికంగా వేధించిన చక్రవర్తిపై విచారణ కమిటీ నివేదిక వెల్లడి

55 మంది విద్యార్థినులు, 15 టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ ఫిర్యాదులన్నీ నిజమే

మరో ముగ్గురు సిబ్బంది కూడా విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని వేధింపులు

అటు లైంగిక వేధింపులపై ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌లో వచ్చిన కథనంపై సీఎం సీరియస్‌

(కాకినాడ,ఆంధ్రజ్యోతి)

‘‘ఏయ్‌..ఒక్కడినే వెళ్తున్నా...కారులో వస్తావా...ఏంటీ సరిగ్గా డ్యూటీ చేయడం లేదు.. ఆరోజు ఏకాంతంగా కలుద్దామా...ఈ మధ్య బాడీ వెయిట్‌ పెరిగిపోతోంది..రూంలోకి వెళ్దామా..అన్నీ చూసుకుంటా..’’ అంటూ భుజాల మీద చేతులు వేయడం..అక్కడి నుంచి నడుంపైన.. తోడలను తాకడం..ఎవరైనా పేషెంట్లు చూసి మందలిస్తే వారిపైనా అరవడం...ఇలా ఒకటేంటి రకరకాల వెకిలి చేష్టలతో లైంగిక వేధింపులకు పాల్పడడం జీజీహెచ్‌లో బయోకెమిస్త్రీ ల్యాబ్‌ అసిస్టెంట్‌ వి.కళ్యాణ్‌ చక్రవర్తి పరిపాటిగా మారింది. ఒకటికాదు రెండుకాదు అనేకసార్లు ఇతడి ప్రవ ర్తన గతి తప్పి వ్యవహరిస్తూనే ఉంది. పలుసార్లు విద్యార్థినులు సంబంధిత విభాగం హెచ్‌వోడీ దృష్టికి చక్రవర్తి కీచకపర్వాన్ని తీసుకెళ్లినా చక్ర వర్తి తన తీరు మార్చుకోలేదని విచారణ కమిటీ స్పష్టంచేసింది. జీజీహెచ్‌లో విద్యార్థినులను లైం గికంగా వేధించిన ఘటనపై విచారణ చేపట్టిన అంతర్గత కమిటీ తన నివేదికను రంగరాయ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌, అడిషనల్‌ డైరెక్టర్‌కు శుక్రవారం అందజేసింది. తమ విచారణలో తేలిన అనేక విషయాలను నివేదికలో ఇంటర్న రల్‌ కంప్లైంట్స్‌ కమిటీ ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ కూ లంకుషంగా వివరించారు. జీజీహెచ్‌లో డీఎం ఎల్‌టీ, బీఎస్సీ, ఎంఎల్‌టీ, వొకేషనల్‌ ఎంఎల్‌టీ విద్యార్థినులు మొత్తం 55మంది నుంచి లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు తీసుకున్నామని తెలి పింది. ఇవికాక బయోకెమిస్త్రీ, మైక్రో బయాలజీ, పాథాలజీ విభాగాలకు చెందిన టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ 15 మంది సైతం చక్రవర్తి లైంగిక వేధింపులను పూసగుచ్చినట్టు వివరించారని నివే దికలో ప్రస్తావించింది. ఎన్నో రోజులుగా ల్యాబ్‌ అసిస్టెంట్‌ ఎందరో విద్యార్థులను వేధించినట్టు తేల్చింది. కానీ బాధితులు భయంతో ముందుకు రాలేదని పేర్కొంది. దీన్ని అలుసుగా తీసుకుని చక్రవర్తి మరింత రెచ్చిపోయినట్టు వివరించింది. అనేకసార్లు విద్యార్థులను లైంగికంగా వేధిం చినట్లు తమ విచారణలో తేలినట్టు తెలిపింది. చక్రవర్తి అసభ్య ప్రవర్తన గురించి తమకు కూడా తెలుసని బయోకెమిస్త్రీ, మైక్రో బయాలజీ, పా థాలజీ విభాగాల సిబ్బంది కమిటీ ఎదుట వివరి ంచారని స్పష్టం చేసింది. అలాగే బయోకెమిస్ట్రీ హెచ్‌వోడీ, కొందరు అనేకసార్లు చక్రవర్తిని హె చ్చరించారని, అయినా సదరు ఖాతరు చేయ లేదని కమిటీ తేల్చిచెప్పింది. జీజీహెచ్‌ ఓపీ వి భాగంలోని శాంపిల్‌ కలెక్షన్‌ సెంటర్‌లో తరచూ అసభ్యంగా ప్రవర్తిస్తోన్న చక్రవర్తికితోడు మైక్రో బయోలజీ ల్యాబ్‌ టెక్నీషియన్‌ జిమ్మీరాజు (ఇతడు కోనసీమ జిల్లా మండపేట నియోజకవ ర్గంలోని ఓ వైసీపీ సర్పంచ్‌కు దగ్గరి బంధువు. సదరు సర్పంచ్‌ గతంలో ఉమ్మడి జిల్లా రెవెన్యూ అసోసియేషన్‌లో కీలక నాయకుడిగా సైతం వెలిగారు). బయోకెమిస్ట్రీ ల్యాబ్‌ టెక్నీషియన్‌ గో పాలకృష్ణ ఇద్దరు మద్యం తాగి డ్యూటీకి వచ్చే వారని నివేదికలో కమిటీ వివరించింది. మద్యం తాగి విద్యార్థులపై అరుస్తూ వారిని వేధించే వారని తెలిపింది. అలాగే పాథాలజీ ల్యాబ్‌ అసి స్టెంట్‌ ప్రసాద్‌ అయితే విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని బూతులు తిట్టేవాడడని వివరించింది.

ఏఎస్పీకి రంగరాయ ప్రిన్సిపాల్‌ లేఖ

ఇదిలాఉంటే ఈ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని రంగరాయ కాలేజీ ప్రిన్సిపాల్‌ కాకి నాడ ఏఎస్పీకి శుక్రవారం లేఖ రాశారు. ఈనెల 9న రాత్రి 10.12గంటలకు విద్యార్థినుల నుంచి మెయిల్‌లో ఫిర్యాదు అందిందని, దీని ఆధారంగా విచారణ చేపట్టామని అందులో పేర్కొన్నారు. అందులో చక్రవర్తి అసభ్యకరంగా విద్యార్థినులతో వ్యవహరించాడని.. డర్టీ, వల్గర్‌, రబ్బీష్‌ భాష వాడి విద్యార్థినులు, పేషెంట్లను వేధించాడని పేర్కొన్నారు. బాడీ షేమింగ్‌ చేయడంతోపాటు ఏకాంతంగా విద్యార్థులను తన గదికి రమ్మని కోరినట్లు తేలిందని వివరించారు. అతడికి తోడు మరో ముగ్గురు ల్యాబ్‌ సిబ్బంది సైతం విద్యార్థి నులను వేధించిన నేపథ్యంలో వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోరారు.

సీఎం సీరియస్‌...

జీజీహెచ్‌ విద్యార్థినులపై లైగింక వేధింపుల వ్యవహారం ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌లో కూలం కుషంగా రావడం తీవ్ర కలకలం రేపింది. దీనిపై సీఎం చంద్రబాబు తక్షణం స్పందించారు. కాకి నాడ జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌తో మాట్లా డా రు. తక్షణం నిందితులపై కఠిన చర్యలు తీసు కోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. దీంతో ఆగ మేఘాలపై పోలీసులు నిందితులపై కేసులు నమోదు చేశారు. అటు ఉద్యోగాల నుంచీ సస్పె ండ్‌ చేశారు. ఘటన వెనక ఏం జరిగింది? విద్యా ర్థినులను నిందితులు ఏవిధంగా లైంగికంగా వేధించారనేదానిపై కలెక్టర్‌, ఎస్పీ శుక్రవారం మ ధ్యాహ్నం మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితులపై తీసుకున్న చర్యలను ప్రకటించారు.

Updated Date - Jul 12 , 2025 | 01:06 AM