అన్నవరంలో ఉప ప్రధాన అర్చకుడు, పరిచారకుడు సస్పెండ్
ABN , Publish Date - Jul 19 , 2025 | 01:38 AM
అన్నవరం, జూలై 18 (ఆంధ్రజ్యోతి): కాకి నాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో నెయ్యి డబ్బాలను దొంగిలిస్తూ పట్టుబడిన ఉప ప్రధాన అర్చకుడు హరగోపాల్‌ను సస్పెండ్ చేస్తూ ఆల య ఈవో సుబ్బారావు ఉత్తర్వులు జారీ చేశారు. సత్యదేవుడి తొలిపావంచా వద్ద కనకదుర్గ ఆల యంలో ఉప ప్రధాన అర్చక హోదా కలిగిన చి ట్టెం హరిగోపాల్ కనకదుర్గ అమ్మవారి ఆలయం లో హోమాలు, దీపారధన తదితర వాటికి వినియోగించాల్సిన 3 డబ్బాల నెయ్యిని శుక్రవా

ఈవో సుబ్బారావు ఉత్తర్వులు
అన్నవరం, జూలై 18 (ఆంధ్రజ్యోతి): కాకి నాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో నెయ్యి డబ్బాలను దొంగిలిస్తూ పట్టుబడిన ఉప ప్రధాన అర్చకుడు హరగోపాల్‌ను సస్పెండ్ చేస్తూ ఆల య ఈవో సుబ్బారావు ఉత్తర్వులు జారీ చేశారు. సత్యదేవుడి తొలిపావంచా వద్ద కనకదుర్గ ఆల యంలో ఉప ప్రధాన అర్చక హోదా కలిగిన చి ట్టెం హరిగోపాల్ కనకదుర్గ అమ్మవారి ఆలయం లో హోమాలు, దీపారధన తదితర వాటికి వినియోగించాల్సిన 3 డబ్బాల నెయ్యిని శుక్రవారం ఎటువంటి అనుమతి లేకుండా కారులో తరలిం చే ప్రయత్నం చేయడంతో ఈవోకు అందిన స మాచారంతో ఆయన ఆదేశాలతో ఏఈవో భాస్క ర్ హుటాహుటిన వెళ్లి నిర్ధారించి ఈవోకు నివేదించారు. దీంతో అతడిని సస్పెండ్ చేస్తూ ఉత్త ర్వులు జారీచేశారు. పట్టుబడిన నెయ్యి డబ్బాల విలువ రూ.27వేలుగా అధికారులు తెలిపారు. 3 డబ్బాలను విచారణాధికారులు స్వాధీనం చేసుకుని దేవస్థానం సెంట్రల్‌స్టోర్స్‌కి తరలించారు. గతేడాది పదవీ విరమణ చేయాల్సిన సమయం లో ప్రభుత్వ జీవో కారణంగా ఆయన విధుల్లో కొనసాగుతున్నారు. ఆది నుంచి అర్చకుడు వివాదాస్పదంగానే విధులు నిర్వహిస్తుండడం విశేషం. గతంలో ఒకసారి అతడు పనిచేసే వనదుర్గ ఆలయ తాళాలు ఇంటికి పట్టుకెళ్లిన సంఘటనను సహచర అర్చకులు గుర్తుచేస్తున్నారు. అలాగే ఇదే సంఘటనలో అదే ఆలయంలో పరి చారకుడిగా పనిచేస్తున్న ఎన్‌ఎస్.సుబ్రహ్మణ్య కృష్ణకుమార్‌ను కూడా సస్పెండ్ చేశారు.