Share News

అన్నవరంలో 70 వేల ప్రసాదం ప్యాకెట్ల విక్రయాలు

ABN , Publish Date - Jun 30 , 2025 | 12:10 AM

అన్నవరం, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): ఆషాఢమాసం తొలి ఆదివారం సత్యదేవుడి ప్రసాదం విక్రయాల్లో భాగంగా సుమారు 70 వేల ప్యాకెట్లను విక్రయించినట్టు ప్రసాదం విభాగ అధికారులు తెలిపారు. తలుపులమ్మ లోవ అమ్మవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో భక్తులు అన్నవరంలో ఆగి స్వామి

అన్నవరంలో 70 వేల ప్రసాదం ప్యాకెట్ల విక్రయాలు
జాతీయ రహదారిపై నమూనాలయం వద్ద ప్రసాదం కొనుగోలుకు వేచి ఉన్న భక్తులు

అన్నవరం, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): ఆషాఢమాసం తొలి ఆదివారం సత్యదేవుడి ప్రసాదం విక్రయాల్లో భాగంగా సుమారు 70 వేల ప్యాకెట్లను విక్రయించినట్టు ప్రసాదం విభాగ అధికారులు తెలిపారు. తలుపులమ్మ లోవ అమ్మవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో భక్తులు అన్నవరంలో ఆగి స్వామిని దర్శించి ప్రసాదాలు కొనుగోలు చేస్తుంటారు. దీనికణుగుణంగా తొలిపావంచా వద్ద జాతీయ రహదారిపై ఉన్న రెం డు నమూనాలయల వద్ద అదనపు కౌంటర్లను ఏర్పాటుచేయడంతో పాటు సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయిస్తూ ఈవో సుబ్బారావు ఆదేశాలిచ్చారు. లోవ భక్తులు 45వేల ప్యాకెట్లు, కొండపై సత్యదేవుడిని దర్శించిన భక్తులు మరో 25వేలు ప్యాకెట్లు కొనుగోలు చేశారని తెలిపారు.

రూ.లక్ష విరాళం

అన్నవరం దేవస్థానంలో నిర్వహిస్తున్న సత్యదేవా నిత్యాన్నదాన పథకానికి ఆదివారం హైదరాబాద్‌కు చెందిన గుబ్బల హరిప్రియ రూ.లక్ష విరాళాన్ని ఈవో వీర్ల సుబ్బారావుకు అందజేశారు. దాతను ఈవో అభినందించి వారికి ప్రత్యేక దర్శనం, స్వామివా రి ప్రసాదం అందజేశారు.

Updated Date - Jun 30 , 2025 | 12:10 AM