శానిటేషన్ మెరుగుపడకపోతే చర్యలు
ABN , Publish Date - Jun 17 , 2025 | 12:56 AM
అన్నవరం, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో శానిటేషన్ నిర్వహణపై భక్తుల్లో 50శాతం మాత్రమే సంతృప్తి ఉందని, పరిస్థితి మెరుగుపడకపోతే చర్యలు తప్పవని ఈవో వీర్ల సుబ్బారావు హెచ్చరించారు. సోమవారం తన కార్యాలయంలో శానిటేషన్ సూపర్‌వైజర్లు, అధికారులతో స

అన్నవరం దేవస్థానం ఈవో హెచ్చరిక
శానిటేషన్ సూపర్‌వైజర్లు,
అధికారులతో సమీక్ష
అన్నవరం, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో శానిటేషన్ నిర్వహణపై భక్తుల్లో 50శాతం మాత్రమే సంతృప్తి ఉందని, పరిస్థితి మెరుగుపడకపోతే చర్యలు తప్పవని ఈవో వీర్ల సుబ్బారావు హెచ్చరించారు. సోమవారం తన కార్యాలయంలో శానిటేషన్ సూపర్‌వైజర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సత్రం గదుల్లో నిర్వహణ సరిగా లేదని, భక్తులకు శానిటేషన్ సిబ్బంది వారు కోరిన సమాచారం అందించాలని, మర్యాదపూర్వకంగా మెలగాలని సూచించారు. ఆలయ పరిసరాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగినా ఎవరో వస్తారని చూడకుండా తక్షణ సాయం అందించాలన్నారు. ప్రతిశానిటరీ సూపర్‌వైజర్ వద్ద దేవస్థానం వైద్యుని, అంబులెన్స్ ఫోన్ నెంబ ర్లు ఉంచుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు. ఇక్కడ జరిగే శానిటేషన్ నిర్వహణ దేవదాయశాఖ ప్రధాన కార్యలయం, సీఎంవోలో నివేదిక రూపంలో ఉంటు ందని జాగ్రత్తగా మెలగాలని సూచించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్ట్‌ర్ వెంకటేశ్వరరావు, సూపరెంటెండెంట్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
దినుసులు పరిశీలన
అన్నవరం దేవస్థానానికి అవసరమయ్యే దినుసులును సోమవారం ఆహార నియంత్రణ అధికారి సుబ్బారావు సోమవారం పరిశీలించారు. ఇప్ప టివరకు టెండర్ దాఖలు సమయంలో వీటిని పరిశీలించి హడావిడిగా ముగించేవారు. ఈనెల 20న టెండర్లు తెరవనున్న సమయంలో ముందస్తుగా టెండర్‌దారులు సరఫరా చేయనున్న దినుసుల శాంపిల్స్ తీసుకురావాలని ఈవో సుబ్బారావు గుత్తేదారులను ఆదేశించి నాణ్యత ఫుడ్‌ఇన్‌స్పెక్టర్ పర్యవేక్షణలో పరిశీలించారు. ఈ సందర్భంగా సోమవారం తీసుకొచ్చిన శాంపిల్స్ ఏ విధంగా ఉన్నాయో టెండర్ ఖరారయ్యాక ఇదే నాణ్యతతో కూడిన దినుసులు సరఫరా చేయాలన్నారు. కార్యక్రమంలో సెంట్రల్‌స్టోర్స్ అధికారులు భాస్కర్, సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు.