ఫుడ్ ప్రాసెసింగ్ అభివృద్ధికి సహకరించండి
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:53 PM
ఫుడ్ ప్రాసెసింగ్ రంగం అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత కోరారు.
కేంద్ర మంత్రిని కలిసిన టీజీ భరత
కర్నూలు అర్బన, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): ఫుడ్ ప్రాసెసింగ్ రంగం అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత కోరారు. సోమవారం ఢిల్లీలోని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వానను టీజీ భరత కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత మాట్లాడుతూ ఫుడ్ ప్రాసెసింగ్‌కు సంబధించి కీలక అంశాలపై చర్చించామని, రాష్ట్రంలో టమోటా పంటను అధికంగా పండిస్తున్న రాయలసీమ జిల్లాల్లో అపరేషన గ్రీన్స పథకం కింద మొదటి విడత, రెండో విడత మొత్తం రూ. 9.76 కోట్లు విడుదల చేశామని, 6 నెలల్లోపు ప్రాజెక్టును పూర్తి చేయడానికి మిగిలిన గ్రాంట్ మొత్తం రూ. 34.17 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరామని తెలిపారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ అవతరించిందన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 175 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పీఎంకేవైసీ స్కీమ్ కింద ఏపీ ఫుడ్ ప్రాసెసింగగ్ యూనిట్లు పెట్టాలనుకునే వారు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకునేలా ఏపికీ వెసులుబాటు కల్పించాలని మంత్రి టీజీ భరత కోరారు.