CM Chandrababu Orders: 'మొంథా' తుఫాన్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ABN , Publish Date - Oct 26 , 2025 | 12:40 PM
మొంథా' తుఫాన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మొంథా తుఫాన్ ను ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధం కావాలని ఆదేశించారు. విద్యుత్, టెలికాం, తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని తెలిపారు.
ఏపీ డెస్క్, అక్టోబర్ 26: 'మొంథా' తుఫాన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మొంథా తుఫాన్ ను ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధం కావాలని ఆదేశించారు. విద్యుత్, టెలికాం, తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని సీఎం సూచించారు. తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu) ఆదేశించారు. తుఫాన్ కారణంగా రోడ్లు, చెరువులు, కాలువ గట్లు కోతకు గురైతే తక్షణ మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. సముద్రంలోకి వెళ్లిన పడవలను వెనక్కి రప్పించాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు దుబాయ్(Dubai Tour) పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.
మొంథా తుఫాన్(Montha Cyclone Andhra Pradesh) సన్నాహక చర్యల పర్యవేక్షణపై చంద్రబాబు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో జిల్లాల వారీగా సీనియర్ IASలకు ప్రత్యేక బాధ్యతలు అప్పజెప్పింది. ప్రత్యేక అధికారులు తక్షణమే కేటాయించిన జిల్లాలకు చేరుకుని, కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తుఫాన్ సమయంలో అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని సహాయ, పునరావాస చర్యలు పర్యవేక్షించాలని తెలిపారు. నష్టం అంచనా, పరిహారం పంపిణీ, పునరుద్ధరణ పూర్తయ్యేవరకు.. విధులు కొనసాగించాలని ప్రత్యేక అధికారలకు ప్రభుత్వం(Andhra weather alert,) ఆదేశాలిచ్చింది..
మరోవైపు 'మొంథా' తుఫాన్(Montha Cyclone) రాష్ట్రంపైకి దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శనివారం ఉదయం వాయుగుండంగా బలపడిందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. శనివారం సాయంత్రానికి వాయుగుండం.. పోర్టుబ్లెయిర్ కు 510 కి.మీ, చెన్నైకి 890, విశాఖపట్నానికి 920, కాకినాడకు 920 దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా(cyclone preparedness), సోమవారం ఉదయానికి నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..
Investment in Adani Raises: జీవిత బీమా..అదానీకి ధీమా
Congress Demands: పీఏసీ దర్యాప్తు జరగాలి కాంగ్రెస్