Share News

Festival Celebration: చంద్రబాబు దంపతుల దీపావళి

ABN , Publish Date - Oct 22 , 2025 | 06:41 AM

సీఎం చంద్రబాబు దీపావళి వేడుకలను ఉండవల్లి నివాసంలో సతీమణి భువనేశ్వరితో కలిసి జరుపుకొన్నారు.

Festival Celebration: చంద్రబాబు దంపతుల దీపావళి

అమరావతి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు దీపావళి వేడుకలను ఉండవల్లి నివాసంలో సతీమణి భువనేశ్వరితో కలిసి జరుపుకొన్నారు. లక్ష్మీ పూజ నిర్వహించిన అనంతరం ప్రమిదలు వెలిగించారు. అనంతరం ఇద్దరూ కాకరపువ్వొత్తులు కాల్చారు. సీఎం నివాసం చెంతనే అనాథ పిల్లలు ఉండే చిగురు ఆశ్రమానికి భువనేశ్వరి వెళ్లారు. ఆశ్రమంలోని పిల్లలకు బాణసంచా, స్వీట్లు పంచారు. వారితో కలిసి బాణసంచా కాల్చారు. అనంతరం వారికి భోజనం వడ్డించారు. పిల్లలతో మాట్లాడి, వారి బాగోగులు తెలుసుకున్నారు.

Updated Date - Oct 22 , 2025 | 06:42 AM