APTS Chairman Mannava Mohana Krishna: సీఐఐ సదస్సు సూపర్ హిట్.. కూటమి ప్రభుత్వంపై మన్నవ మోహనకృష్ణ ప్రశంసలు..
ABN , Publish Date - Nov 16 , 2025 | 09:35 AM
ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ విశాఖపట్నంలో నిర్వహించిన రెండు రోజుల ప్రతిష్టాత్మక సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్నారు. అనేక దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడంతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మరో దశలోకి అడుగుపెడుతోందని మన్నవ మోహనకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు.
విశాఖపట్నంలో నిర్వహించిన రెండు రోజుల ప్రతిష్టాత్మక సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన్నవ మోహనకృష్ణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అభివృద్ధికి నాంది పలుకుతూ పెట్టుబడిదారులను ఆహ్వానించారని అన్నారు. విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషి అత్యంత ప్రశంసనీయమని పేర్కొన్నారు.

అనేక దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడంతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మరో దశలోకి అడుగుపెడుతోందని మన్నవ మోహనకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. విశాఖ వేదికగా రెండురోజులు పాటు సాగిన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు సూపర్ హిట్ అయిందని, రెండు రోజుల్లో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించడం గొప్ప రికార్డని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో యువతకి 20లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ముందుకు వెళుతోందని చెప్పారు.
విశాఖపట్నంలో ఈ సీఐఐ సమిట్ నిర్వహణతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత ఆకర్షణీయ పెట్టుబడి గమ్యస్థానంగా మారిందని పేర్కొన్నారు. పరిశ్రమలకు భూములు, మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఏపీ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంటే.. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో ఒక్క నూతన కంపెనీ రాకపోగా, ఉన్న పరిశ్రమలనే వెళ్లగొట్టి రాష్ట్రాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. ఈ సీఐఐ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను దేశవ్యాప్తంగా అత్యంత ఆకర్షణీయ పెట్టుబడి రాష్ట్రంగా మార్చడమే ముఖ్య లక్ష్యమని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి