CID : కాకినాడ సీపోర్టు వాటాలపై..విజయసాయిరెడ్డికి సీఐడీ నోటీసు
ABN , Publish Date - Mar 11 , 2025 | 05:03 AM
కాకినాడ సీపోర్టు ప్రైవేటు లిమిటెడ్ అధిపతి కేవీ రావును బెదిరించి అక్రమంగా వాటాలను తీసుకున్న కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సీఐడీ నోటీసులు జారీచేసింది.

రేపు విచారణకు రావాలని శ్రీముఖం
విజయవాడ, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): కాకినాడ సీపోర్టు ప్రైవేటు లిమిటెడ్ అధిపతి కేవీ రావును బెదిరించి అక్రమంగా వాటాలను తీసుకున్న కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సీఐడీ నోటీసులు జారీచేసింది. విజయవాడ ప్రాంతీయ కార్యాలయంలో బుధవారం విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొంది. కేవీ రావు ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన సీఐడీ.. విజయసాయిరెడ్డిని ఏ-2గా చేర్చింది. ఇప్పటికే నాటి ఆడిటర్లను విచారించింది. ఈ కేసులో ఈడీ కూడా కొన్నాళ్ల కిందట విజయసాయిని విచారించింది.