TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయం
ABN , Publish Date - Jul 30 , 2025 | 11:48 AM
శ్రీవాణి టిక్కెట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి టిక్కెట్ల కోటాను భారీగా పెంచింది. శ్రీవాణి టికెట్స్ కోసం భక్తుల నుంచి భారీగా డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో టికెట్ల కోటాను పెంచాలని టీటీడీ నిర్ణయించింది.

తిరుమల: శ్రీవాణి టిక్కెట్లపై (Srivani Tickets) తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి టిక్కెట్ల కోటాను భారీగా పెంచింది. శ్రీవాణి టికెట్స్ కోసం భక్తుల నుంచి భారీగా డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో టికెట్ల కోటాను పెంచాలని నిర్ణయించింది టీటీడీ. 1500 టిక్కెట్ల కోటాను 2వేల టికెట్లకు పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి రోజు కరెంటు బుకింగ్ కోటా క్రింద తిరుమలలో 2వేల టిక్కెట్లు, రేణిగుంట విమానాశ్రయంలో 400 టిక్కెట్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.
శ్రీవాణి దర్శన సమయంలో కూడా టీటీడీ మార్పులు చేసింది. ప్రస్తుతం ఉదయం శ్రీవాణి టికెట్స్ కలిగిన భక్తులను దర్శనానికి అనుమతిస్తుండగా ఇకపై సాయంత్రం దర్శనానికి కూడా అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. తద్వారా గదులకు నెలకొని ఉన్న డిమాండ్ తగ్గుతోందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. శ్రీవాణి టికెట్ల జారీ సమయంలో కూడా మార్పులు చేసింది టీటీడీ. ఇకపై టికెట్ పొందిన నాటి సాయంత్రమే భక్తుడు వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లేలా టీటీడీ మార్పులు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
లిక్కర్ కుంభకోణంలో సంచలనం.. విచారణలో సిట్ దూకుడు
సింగపూర్‌లో సీఎం చంద్రబాబు బిజీ షెడ్యూల్.. పెట్టుబడులపై కీలక చర్చలు
Read latest AndhraPradesh News And Telugu News