Chicken and Eggs Price Hike: కార్తీక మాసం పూర్తయ్యింది.. చికెన్, గుడ్డు రేట్లు అమాంతం పెరిగాయి
ABN , Publish Date - Nov 23 , 2025 | 08:59 AM
కార్తీకమాసం పూర్తయ్యింది.. మార్గశిర మాసం మొదలైంది. దీంతో దేశ వ్యాప్తంగా కోడి గుడ్డు, చికెన్ ధరలు పెరుగుతున్నాయి. ఈ నెలాఖరుకు ఈ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, గత కొన్నేళ్లుగా ఇంత పెద్ద ఎత్తున..
ఇంటర్నెట్ డెస్క్: కార్తీకమాసం నవంబర్ 20వ తేదీతో పూర్తయ్యింది.. దీంతో చికెన్, కోడిగుడ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కిలో చికెన్ మార్కెట్లో దాదాపు 250 రూపాయలు పలుకుతుంది. అయితే, ఆన్ లైన్ రేట్(రూ.220), పేపర్ ధర (ఫామ్ గేట్) రూ. 207గా ఉంది. ఈ నెలాఖరుకు 280 రూపాయల వరకూ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఇక, కోడి గుడ్డు విషయానికొస్తే, ఒక్కొక్కటి ధర రూ. 7 చేరుకుంది.
కూరగాయల ధరలు అధికంగా ఉన్నప్పుడు కోడిగుడ్లతో సరిపెట్టుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఇవి కూడా ఇప్పుడు భారం అయ్యాయి. మరో నెల.. రెండు నెలల్లో డజను గుడ్లు సెంచరీ కొట్టే అవకాశం కూడా ఉంది. ప్రతీ ఏడాదిలాగే కార్తీక మాసం ముగిసి నవంబర్ 21 నుంచి మార్గశిర మాసం మొదలుకావడంతో కోడి గుడ్డు, చికెన్ ధరలు పెరుగుతున్నాయి.
ఎగ్ ధర హోల్‌సేల్‌గా రూ.6.35 ఉండగా.. రిటెయిల్గా రూ.7 , రూ.7.50 నుంచి రూ. 8 వరకు ధర పలుకుతోంది. చలికాలంలో ఎగ్స్ ధరలు పెరగడం సాధారణమేనని కొందరు వ్యాపారులు చెబుతున్నారు. అయితే, గత కొన్నేళ్లుగా ఇంత పెద్ద ఎత్తున పెరగలేదని కూడా అంటున్నారు.
ఒక్క హైదరాబాద్ లోనే రోజుకు కోటి కోడి గుడ్లకు పైగా వినియోగం అవుతున్నాయి. తెలంగాణ మొత్తంలో రోజుకు వినియోగించే గుడ్ల సంఖ్య 3 కోట్ల మేర ఉంటుందని ఒక అంచనా. దేశంలో రోజుకు 30 కోట్ల గుడ్లు ఉత్పత్తి జరుగుతుండగా.. తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్లకు పైగానే ఎగ్స్ ఉత్పత్తి అవుతుండటం గమనార్హం.

ఈ వార్తలు కూడా చదవండి...
సత్యసాయి చూపిన మార్గంలో కోట్లాది భక్తులు నడుస్తున్నారు: మంత్రి నారా లోకేశ్
ఏపీలో భారీ పేలుడు.. ఏమైందంటే..
Read Latest AP News And Telugu News