SIT Custody Arrest: జైలు వద్ద చెవిరెడ్డి హల్‌చల్
ABN , Publish Date - Jul 02 , 2025 | 06:37 AM
మద్యం కేసులో అరెస్టయినప్పటి నుంచి నానా హడావుడి చేస్తున్న చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మరోసారి అదే చేశారు. విజయవాడ జైలు నుంచి సిట్ అధికారులు కస్టడీకి తీసుకుని బయటకు రాగానే చెవిరెడ్డి రెచ్చిపోయారు.

విజయవాడ, జూలై 1(ఆంధ్రజ్యోతి) : మద్యం కేసులో అరెస్టయినప్పటి నుంచి నానా హడావుడి చేస్తున్న చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మరోసారి అదే చేశారు. విజయవాడ జైలు నుంచి సిట్ అధికారులు కస్టడీకి తీసుకుని బయటకు రాగానే చెవిరెడ్డి రెచ్చిపోయారు. మీడియాను చూడగానే స్వరం పెంచి కేకలు వేశారు. తనపై అన్యాయంగా కేసు పెట్టారని ఆరోపించారు. జరుగుతున్న పరిణామాలను పై నుంచి దేవుడు చూస్తున్నాడన్నారు. రాజమౌళి, సుకుమార్ వంటి గొప్పగొప్ప దర్శకులు, నటులు సిట్‌లో ఉన్నారని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరినీ వదలబోమంటూ హెచ్చరిస్తూ పోలీసు జీపు ఎక్కారు. కాగా, మద్యం కేసులో అరెస్టయిన చెవిరెడ్డి పీఏలను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి సిట్ పోలీసులు విజయవాడకు తీసుకొచ్చారు. బాలాజీ యాదవ్, నవీన్‌లను ఇండోర్‌లో సిట్ పోలీసులు సోమవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారిని అక్కడ 10/1 జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం హాజరుపరిచారు. అనంతరం ట్రాన్సిట్ వారెంట్‌పై విమానంలో విజయవాడకు తీసుకొచ్చారు. వారిని ఏసీబీ కోర్టులో బుధవారం హాజరుపరుస్తారు.