ఇండియన మెడికల్ పార్లమెంటేరియన్స ఫోరం జాయింట్ కన్వీనర్‌గా బైరెడ్డి శబరి
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:59 PM
నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరిని ఇండియన మెడికల్ పార్లమెంటేరియన్స ఫోరం జాయింట్ కన్వీనర్‌గా భారత ప్రభుత్వం నియమించింది.

నంద్యాల హాస్పిటల్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరిని ఇండియన మెడికల్ పార్లమెంటేరియన్స ఫోరం జాయింట్ కన్వీనర్‌గా భారత ప్రభుత్వం నియమించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి జేపీ నడ్డా చైర్మనగా వ్యవహరిస్తారు. పార్లమెంట్ సభ్యులకు భారతదేశంలో ప్రజారోగ్య సమస్యలను పరిష్కరించడంలో విశేషమైన సహకారం అందిస్తుందని బైరెడ్డి శబరి తెలిపారు. 2006లో ఐఎంపీఎఫ్ ప్రారంభమై దేశం ఆరోగ్యం సంరక్షణ ల్యాండ్‌స్కేప్‌లో కీలకమైన శక్తిగా ఉద్భవించిందన్నారు. పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన వైద్య నిపుణులతో కూడిన ఫోరం క్లిష్టమైన ఆరోగ్య సమస్యలపై ప్రజలకు, పార్లమెంట్‌కు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి వీలు కల్పిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి శబరి కృతజ్ఞతలు తెలిపారు.