AP Free Bus: ఏపీ మహిళలకు బంపరాఫర్.. ఇక ఎక్కడికైనా ప్రయాణం ఫ్రీ.. ఫ్రీ
ABN , Publish Date - May 17 , 2025 | 08:26 PM
ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు పలు గుడ్ న్యూస్‌లు చెప్పారు. ఆగస్టు 15నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు.

AP Free Bus: ఆంధ్రప్రదేశ్ మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు బంపరాఫర్ ప్రకటించారు. ఇక నుంచి ఆడవాళ్లు ఎక్కడి నుంచి ఎక్కడికైనా రాష్ట్రంలో ఉచితంగా ప్రయాణించవచ్చు. పంద్రాగష్టు నుంచి ఈ ఫ్రీ బస్ పథకం అమల్లోకి వస్తుంది. దీంతో ఆగస్టు 15నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు అందుబాటులోకి రానుందన్నమాట. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇప్పటికే కార్యక్రమాలు అమలు చేస్తున్న చంద్రబాబు సర్కారు.. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు సౌకర్య హామీని కూడా పూర్తి చేస్తోంది. ప్రతీ నెల ఒకటొవ తారీఖున పెంచిన పింఛన్లు క్రమం తప్పకుండా అందిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం, దీపం పథకం ద్వారా మహిళల ఖాతాల్లో డబ్బులు వేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతోంది. అటు, అమ్మఒడి కార్యక్రమం ద్వారా కూడా తల్లుల ఖాతాల్లో ఇక సొమ్ములు క్రమం తప్పకుండా పడనున్నాయి. అటు, డీఎస్సీ రిక్రూట్స్‌మెంట్‌కు కూడా చకచకా చర్యలు జరిగిపోతున్నాయి. ఈ వేసవి సెలవుల అనంతరం నియామక ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.
ఇవాళ అటు, రైతన్నలకు కూడా సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. కేంద్రం ఇచ్చే కిసాన్ సొమ్ములకు సరిసమానంగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తామన్నారు. కర్నూలు(Kurnool) జిల్లా, పాణ్యం నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu) పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం పలు అభివృద్ధి సంక్షేమ పథకాల్ని ప్రకటించారు.
రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించండని ఈ సందర్భంగా చంద్రబాబు రాష్ట్రప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతినెలా మూడో శనివారం ఇళ్లు, పరిసరాల్లోని శుభ్రతపై దృష్టి పెట్టాలని కోరారు. ప్రపంచం మెచ్చుకునేలా రాష్ట్రంలో యోగా కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు చంద్రబాబు చెప్పారు. కర్నూలులోని రైతుబజార్‌ను రూ.6 కోట్లు కేటాయించి ఆధునీకరిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రపంచంలో ఏదీ వేస్ట్ కాదన్న చంద్రబాబు.. ప్రతి ఒక్కటీ విలువైనది. తడి చెత్త, పొడి చెత్త కాన్సెప్ట్ ను తీసుకొచ్చి పవర్ గ్రిడ్ కు శ్రీకారం చుట్టామన్నారు. త్వరలోనే దీపం పథకం లబ్ధిదారులకు డబ్బులు అకౌంట్‌లలో జమ చేస్తామన్నారు. డిఎస్సీ ద్వారా 16500 ఉద్యోగాలు స్కూల్‌లు ఓపెన్ చేసే లోపు పూర్తి చేస్తామని తెలిపారు. కేంద్రం రైతులకు ఇచ్చే అమౌంట్కు సమానంగా మూడు విడతల్లో రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తామన్నారు.
ఇవి కూడా చదవండి..
Rahul Dravid: ఇక, టిక్కెట్ల గురించి భయం లేదు.. రోహిత్‌కు రాహుల్ ద్రవిడ్ ఫన్నీ మెసేజ్
Rohit Sharma: రోహిత్ శర్మకు కోపమొచ్చింది.. తమ్ముడిని ఎలా తిట్టాడో చూడండి..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
డ్రోన్లతో విన్యాసాలు