Share News

బాబు, లోకేశ్‌... అబద్ధాల్లో దిట్టలు: బొత్స

ABN , Publish Date - Jul 04 , 2025 | 04:29 AM

చంద్రబాబు వంద అబద్ధాలు చెబితే... ఆయన కుమారుడు లోకేశ్‌ 200ల అబద్ధాలు చెబుతారు. అబద్ధాల్లో వీరిద్దరూ దిట్ట’ అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.

బాబు, లోకేశ్‌... అబద్ధాల్లో దిట్టలు: బొత్స

శ్రీకాకుళం, జూలై 3(ఆంధ్రజ్యోతి): ‘చంద్రబాబు వంద అబద్ధాలు చెబితే... ఆయన కుమారుడు లోకేశ్‌ 200ల అబద్ధాలు చెబుతారు. అబద్ధాల్లో వీరిద్దరూ దిట్ట’ అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. గురువారం శ్రీకాకుళంలో నిర్వహించిన జిల్లా వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నామని చెప్పారు. కాగా ఇదే సభలో వైసీపీ నేత పేడాడ తిలక్‌ మాట్లాడుతూ.. ఒరేయ్‌ అచ్చెన్నాయుడు.. నీకు దమ్ము ధైర్యం ఉంటే.. ఒక అమ్మకు అబ్బకు పుట్టి ఉంటే రారా అంటూ రెచ్చిపోయారు. ఈ కార్యక్రమానికి ధర్మాన ప్రసాదరావు గైర్హాజరయ్యారు.

Updated Date - Jul 04 , 2025 | 04:31 AM