APSRTC Employees: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి
ABN , Publish Date - Jul 08 , 2025 | 06:52 AM
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆ సంస్ధ చైర్మన్ కొనకళ్ల నారాయణకు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకులు విజ్ఞప్తి చేశారు.

చైర్మన్‌కు 24 డిమాండ్లతో ఈయూ నాయకుల వినతి
విజయవాడ(బస్సుస్టేషన్), జూలై 7(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆ సంస్ధ చైర్మన్ కొనకళ్ల నారాయణకు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకులు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ చైర్మన్‌ను సోమవారం ఆయన చాంబర్‌లో ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు ఆధ్వర్యంలో పలువురు నాయకులు కలిసి 24 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందచేశారు. ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌ఎస్) ద్వారా వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారని, పాత పద్ధతిలో రిఫరల్ ఆసుపత్రుల ద్వారా వైద్య సౌకర్యాలు అందించాలని కోరారు.