Share News

AP Mega DSC: ఏపీ డీఎస్సీ పరీక్షలు.. ఈ విషయాలు తెలుసుకోండి..

ABN , Publish Date - Jun 05 , 2025 | 09:47 PM

AP Mega DSC: ఏపీ మెగా డీఎస్సీలో భాగంగా మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇక, మెగా డీఎస్సీకి 3,35,401 మంది అప్లై చేసుకున్నారు. అన్ని పోస్టులకు కలిపి 5,77,417 మంది అప్లికేషన్లు అందాయి.

AP Mega DSC: ఏపీ డీఎస్సీ పరీక్షలు.. ఈ విషయాలు తెలుసుకోండి..
AP Mega DSC

విజయవాడ: ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. జూన్ 6వ తేదీన ప్రారంభం అయ్యే పరీక్షలు.. జులై 6వ తేదీన ముగియనున్నాయి. ప్రతీ రోజూ రెండు సెషన్ల వారీగా పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి 12 వరకు ఓ సెషన్.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 వరకు ఇంకో సెషన్ ఉండనుంది. ఈ పరీక్షలకు సంబంధించి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హాల్ టికెట్లకు సంబంధించి అభ్యర్థులకు విద్యాశాఖ ఓ వెసులుబాటును కల్పించింది. అందులో ఏవైనా తప్పులు ఉంటే పరీక్ష కేంద్రాల వద్ద సరిచేసుకోవచ్చని ప్రకటించింది.


అమల్లో నిమిషం రూలు..

శుక్రవారం మొత్తం 154 సెంటర్లలో పరీక్షలు జరగనున్నాయి. ఆన్‌లైన్ విధానం ద్వారా అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులు నిమిషం ఆలస్యంగా వచ్చినా లోపలికి అనుమతించబోమని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. నిమిషం రూలును దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు ముందుగానే ఎగ్జామ్ సెంటర్లకు వెళ్లటం ఉత్తమం. ఇక, హాల్ టికెట్‌లో తప్పులు ఉంటే అభ్యర్థులు భయపడాల్సిన అవసరం లేదు. పరీక్ష కేంద్రాల వద్దే వాటిని సరి చేసుకునే అవకాశం ఉంది.


హాల్ టికెట్లో ఫొటో లేకపోతే రెండు ఫొటోలను తీసుకెళ్లాలి. ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డు వంటి ధ్రువీకరణ పత్రాలను చూపించాలి. ఏపీ మెగా డీఎస్సీలో భాగంగా మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇక, మెగా డీఎస్సీకి 3,35,401 మంది అప్లై చేసుకున్నారు. అన్ని పోస్టులకు కలిపి 5,77,417 మంది అప్లికేషన్లు అందాయి. కొంతమంది తమ అర్హతలకు అనుగుణంగా ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు.


ఇవి కూడా చదవండి

చిన్నస్వామి స్టేడియం విషాదం.. ఆర్సీబీ, KSCAపై కేసు

మరీ ఇంత దారుణమా.. అమ్మాయిలపై మగాళ్ల గుంపు దాడి..

Updated Date - Jun 05 , 2025 | 10:04 PM