Share News

Diwali 2025: తెలుగు ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు దీపావళి శుభాకాంక్షలు

ABN , Publish Date - Oct 19 , 2025 | 06:41 PM

ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. దీపావళి ప్రాశస్త్యాన్ని తెలియచెబుతూ సీఎం..

Diwali 2025: తెలుగు ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు దీపావళి శుభాకాంక్షలు
AP CM Diwali Greetings

అమరావతి, అక్టోబర్ 19: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీపావళి ప్రాశస్త్యాన్ని తెలియచెబుతూ సీఎం చంద్రబాబు, రాష్ట్రం ప్రగతి పథంలో ప్రకాశించాలని ఆకాంక్షించారు. 'దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ | దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమోస్తుతే || పరబ్రహ్మగా భావించే దీపాన్ని ఆరాధించే పవిత్ర దినం అయిన దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. లోకాన్ని పీడిస్తున్న నరకాసురుడు అనే రాక్షసుడిని శ్రీకృష్ణ, సత్యభామ కలిసి వధించిన రోజు ఇది. దీపావళి అంటేనే చీకట్లను పారద్రోలి వెలుగులు తీసుకువచ్చే పండుగ. ఈ దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని.. రాష్ట్రం ప్రగతితో ప్రకాశించాలని ఆకాంక్షిస్తున్నా' అని చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అల్పపీడనం ఎఫెక్ట్... తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 19 , 2025 | 07:36 PM