Nara Lokesh - Betting Apps: బెట్టింగ్ యాప్‌లపై ఉక్కుపాదం మోపుతాం: మంత్రి నారా లోకేష్
ABN , Publish Date - Apr 18 , 2025 | 05:44 PM
ఇటీవలి కాలంలో బెట్టింగ్ యాప్స్ గురించి బాగా వినిపిస్తోంది. దీనిపై తనకు ట్విట్టర్లో వచ్చిన మెసేజ్ మీద మంత్రి నారా లోకేష్ రియాక్టయ్యారు. మొత్తం దేశానికే ఆదర్శప్రాయంగా ఉండేలా చర్యలుంటాయని..

AP Minister Nara Lokesh on Betting Apps: బెట్టింగ్ యాప్‌లపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. బెట్టింగ్ యాప్‌ల వలన జీవితాలు నాశనం అవుతున్నాయని తనకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఎక్స్‌లో పెట్టిన ఒక పోస్టుపై లోకేష్ తీవ్రంగా రియాక్టయ్యారు. బెట్టింగ్ యాప్‌లపై రాష్ట్రంలో ఉక్కుపాదం మోపుతామన్న లోకేష్.. ఏపీలో బెట్టింపు యాప్‌ల నిషేదానికి సమగ్ర విధానాన్ని తీసుకువస్తామని తెలిపారు. ఇది దేశానికే ఆదర్శంగా ఉండే విధానంగా ఉంటుందని చెప్పారు. న్యాయపరమైన అన్ని అవకాశాలను ఉపయోగించుకుని బెట్టింగ్ సంస్కృతిని ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నామని, బెట్టింగ్ యాప్‌ల వలన జీవితాలు నాశనం అవుతున్నాయని పేర్కొన్నారు. అనేక మంది బెట్టింగ్ యాప్‌లకు ఆకర్షితులై ఆర్దికంగా దెబ్బతింటున్నారని, ఇటువంటి పరిస్థితి నుంచి వారిని కాపాడేందుకు అవగాహన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బెట్టింగ్ యాప్‌లలో జూదం ఆడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
"బెట్టింగ్ యాప్‌లు జీవితాలను నాశనం చేస్తున్నాయి. జూదానికి బానిసైన యువత నిరాశలోకి నెట్టబడుతున్నారని నేను వందలాది హృదయ విదారక ఘటనలు వింటున్నాను. ఇది ఆపాలి. దీర్ఘకాలిక పరిష్కారం ఏమిటంటే నిరంతర అవగాహన, ఇంకా.. బెట్టింగ్ యాప్‌లపై కఠినంగా వ్యవహరించడం. మొత్తం దేశానికే ఒక ఉదాహరణగా నిలిచే సమగ్ర బెట్టింగ్ వ్యతిరేక విధానంపై కృషి చేస్తున్నాం. ఈ ముప్పును అంతం చేయడానికి అన్ని చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తాము." అని సదరు పోస్టులో లోకేష్ చెప్పారు.
Also Read:
ఈ దిశలో తాబేలును ఉంచితే కెరీర్‌లో పురోగతి