AP Fake Liquor Case: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. మరో కీలక వ్యక్తి అరెస్ట్
ABN , Publish Date - Nov 30 , 2025 | 05:40 PM
ఆంధ్రప్రదేశ్ నకిలీ మద్యం కేసులో మరో అరెస్టు జరిగింది. ఎ14 తలారి రంగయ్యను ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్టు చేశారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో ఇటీవల రంగయ్య పిటీషన్ వేశారు. అయితే..
విజయవాడ, నవంబర్ 30: ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని నెలలుగా సంచలనం సృష్టిస్తున్న నకిలీ మద్యం కేసులో మరో కీలక అరెస్టు జరిగింది. నకిలీ బ్రాండెడ్ మద్యం బాటిళ్లకు ఒరిజినల్ లాగా లేబుల్స్ సరఫరా చేసిన ఎ14 నిందితుడు తలారి రంగయ్యను ఎక్సైజ్ శాఖ సీఐడీ అధికారులు ఇవాళ అరెస్టు చేశారు.
కాగా, అరెస్ట్‌కు ముందు ముందస్తు బెయిల్ కోసం రంగయ్య ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ వ్యవహారాన్ని కింది కోర్టులోనే తేల్చుకోవాలంటూ హైకోర్టు ఆ పిటీషన్‌ను కొట్టివేసింది. తర్వాత విజయవాడలోని 6వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో కూడా ఆయన బెయిల్ పిటీషన్ రిజెక్ట్ అయింది. దాంతో ఎట్టకేలకు నేడు ఎక్సైజ్ అధికారులు రంగయ్యను అదుపులోకి తీసుకున్నారు.
నకిలీ మద్యం తయారీ చైన్‌లో రంగయ్యదే కీలక పాత్ర అని పోలీసులు ఆరోపిస్తున్నారు. పెద్ద ఎత్తున ఒరిజినల్ బ్రాండ్ల లేబుల్స్‌ను అతనే ముద్రించి, నకిలీ మద్యం నింపిన బాటిళ్లకు అతికించేందుకు సరఫరా చేశాడని ఆధారాలు లభించాయి. ఈ కేసులో ఇప్పటివరకు 50కి పైగా అరెస్టులు జరగగా, తలారి రంగయ్య అరెస్టుతో దర్యాప్తు మరింత లోతుగా సాగే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
బీఎల్ఓల పరిహారం రెట్టింపు.. ఈసీ నిర్ణయం
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిల పక్షం భేటీ..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి