AP Govt: 51 మంది అమరావతి రైతులపై కేసుల ఉపసంహరణ
ABN , Publish Date - Jun 20 , 2025 | 04:07 AM
వైసీపీ పాలనలో అమరావతి రైతులపై నమోదు చేసిన రెండు కేసులను ప్రభుత్వం ఎత్తివేసింది. జగన్ హయాంలో వార్షిక కౌలు చెల్లించకపోవడంతో అమరావతి రైతులు...

రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు
విజయవాడ, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో అమరావతి రైతులపై నమోదు చేసిన రెండు కేసులను ప్రభుత్వం ఎత్తివేసింది. జగన్ హయాంలో వార్షిక కౌలు చెల్లించకపోవడంతో అమరావతి రైతులు విజయవాడ గవర్నరుపేటలోని సీఆర్డీఏ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. దీనిపై గవర్నర్‌పేట పోలీసులు 44 మందిపై ఐపీసీ 143, 188, 341 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు (క్రైం నంబరు 184/2020) నమోదు చేశారు. అలాగే 2023లో ఏడుగురు రైతులపై ఐపీసీ 143, 188, 341, 290 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద గవర్నర్‌పేట పోలీసులు కేసు పెట్టారు. వీరిపై ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అభ్యర్థించడంతో ఈ రెండు కేసుల్లో 51 మందిపై ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరిస్తూ రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ గురువారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేశారు.