దారులన్నీ అటువైపే..!
ABN , Publish Date - Aug 03 , 2025 | 11:58 PM
శ్రావణమాసం సందర్భంగా ప్రముఖ క్షేత్రం ఉరుకుందకు భక్తులు వేలాదిగా తరలివెళ్తున్నారు.

ఉరుకుంద క్షేత్రానికి బారులుదీరిన వాహనాలు
5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
కోసిగి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): శ్రావణమాసం సందర్భంగా ప్రముఖ క్షేత్రం ఉరుకుందకు భక్తులు వేలాదిగా తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో క్షేత్రానికి వెళ్లే దారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. శ్రావణ సోమవారం ఈరన్నస్వామికి జరిగే పూజల్లో పాల్గొనేందుకు ఆదివారం నుంచి భక్తులు బయల్దేరారు. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి భక్తులు వేలాది సంఖ్యలో వాహనాలు ఉరుకుంద క్షేత్రానికి వెళ్తున్నాయి. బారులు తీరాయి. శ్రావణమాసంలో ఉరుకుంద ఈరన్న స్వామికి మూడు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివస్తుండటంతో కోసిగిలో ప్రధాన రోడ్డు నుంచి జుమాలదిన్నె గ్రామం వరకు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎస్‌ఐ హనుమంతురెడ్డి కోసిగిలో ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.