Share News

చోరీ కేసుల్లో నిందితుల అరెస్టు

ABN , Publish Date - Aug 03 , 2025 | 11:56 PM

మండలంలో జరిగిన వివిధ చోరీ కేసుల్లో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి బంగారు, వెండి నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

   చోరీ కేసుల్లో నిందితుల అరెస్టు
నిందితులను, స్వాధీనం చేసుకున్న నగలను చూపిస్తున్న పోలీసులు

5 తులాల బంగారు, 10 తులాల వెండి నగలు స్వాధీనం

ప్యాపిలి, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): మండలంలో జరిగిన వివిధ చోరీ కేసుల్లో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి బంగారు, వెండి నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆదివారం పట్టణంలోని పోలీసు సర్కిల్‌ కార్యాలయంలో నిందితులను హాజరుపరిచి సీఐ వెంకటరామిరెడ్డి కేసుల వివరాలు విలేకరులకు వెల్లడించారు. మండలంలోని హుసేనాపురం గ్రామంలో రెండు, మామిళ్లపల్లి గ్రామంలో ఒక చోరీ జరిగింది. ఈ ఏడాది జూన, జూలై మాసాల్లో ఈ చోరీలకు సంబంధించి జలదుర్గం పోలీసు స్టేషనలో కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులకు సంబంధించిన నిందితులను ఆదివారం మండలంలోని చిగురుమాను దగ్గర ఎస్‌ఐ నాగార్జున, పోలీసు సిబ్బంది అరెస్టు చేసినట్లు సీఐ వెంకటరామిరెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా తొండపాడుకు చెందిన మునగాల సుంకన్న, అదే జిల్లా యాడికి గ్రామానికి చెందిన జోగి రాజాను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 5 తులాల బంగారు, 10 తులాల వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరూ మిక్సీలు, గ్యాస్‌ స్టవ్‌ల రిపేరీ పేరుతో గ్రామాల్లో తిరిగే వారని సీఐ తెలిపారు. ఇళ్లకు తాళాలు వేయడాన్ని గుర్తించి రాత్రిపూట చోరీలకు పాల్పడేవారని తెలిపారు. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్‌కు పంపుతున్నట్లు తెలిపారు. అలాగే కేసులను ఛేదించి, నిందితులను అరెస్టు చేసిన జలదుర్గం ఎస్‌ఐ నాగార్జునను, సిబ్బంది నీలకంఠ, రమణ, మాధవరెడ్డి, వెంకటరాజు, మాదన్న, నరసయ్య, మద్దిలేటి, అశోక్‌, హుసేన బాషా, మహబూబ్‌ బాషాను సీఐ అభినందించారు.

Updated Date - Aug 03 , 2025 | 11:56 PM