న్యూయార్క్‌లో ఘనంగా ఇండియా డే పరేడ్
ABN, Publish Date - Aug 19 , 2024 | 07:54 PM
న్యూయార్క్‌లో ఇండియా డే పరేడ్‌ను భారతీయులు ఘనంగా నిర్వహించారు. ఆగస్ట్ 18వ తేదీన జరిగిన ఈ పరేడ్‌లో వందలాది మంది భారతీయులతోపాటు అమెరికన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పరేడ్‌లో అయోధ్య రామ మందిరం ప్రతిరూపం అందరిని విశేషంగా ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటీనటులు సోనాక్షి సిన్హా, పంకజ్ త్రిపాఠితో పాటు మనోజ్ తివారీ తదితరులు పాల్గొన్నారు. న్యూయార్క్ నగర వీధుల్లో జరిగిన ఈ పరేడ్ నిర్వహణలో త్రివర్ణ పతాకాన్ని చేతబూని భారతీయులు దేశభక్తి గీతాలు ఆలపించారు. అలాగే డ్రమ్స్ వాయించారు. నృత్యం సైతం చేశారు. ఈ వేడుకల్లో న్యూయార్క్ పోలీస్ విభాగానికి చెందిన ఉన్నతాధికారులు సైతం హాజరయ్యారు.

న్యూయార్క్ ఇండియా డే పరేడ్‌లో అయోధ్య రామమందిర ప్రతిరూపం

ఈ పరేడ్‌కు హాజరైన బాలీవుడ్ నటుడు సోనాక్షి సిన్హా, పంకజ్ త్రిపాఠితోపాటు మనోజ్ తివారీ తదితరులు

భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌లో న్యూయార్క్ పోలీసులు కవాతు

ఈ ఇండియా పరేడ్‌లో పాల్గొన్న మిస్ న్యూజెర్సీగా ఎంపికైన జాబిల్లి కందుల

ఇండియా డే పరేడ్ సందర్భంగా న్యూయార్క్ సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కరెక్షన్ సభ్యులు మాన్హాటన్లోని మాడిసన్ అవెన్యూలో కవాతు నిర్వహించారు.
Updated at - Aug 19 , 2024 | 07:54 PM