Share News

బీఓబీ లాభం రూ.4,886 కోట్లు

ABN , Publish Date - May 11 , 2024 | 04:53 AM

నాలుగో త్రైమాసికంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) స్టాండ్‌ అలోన్‌ లాభం 2.3 శాతం పెరిగి రూ.4,886 కోట్లకు చేరుకుంది. కాగా, మొత్తం ఆదాయం రూ.33,775

బీఓబీ లాభం రూ.4,886 కోట్లు

ఒక్కో షేరుకు రూ.7.60 డివిడెండ్‌

న్యూఢిల్లీ: నాలుగో త్రైమాసికంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) స్టాండ్‌ అలోన్‌ లాభం 2.3 శాతం పెరిగి రూ.4,886 కోట్లకు చేరుకుంది. కాగా, మొత్తం ఆదాయం రూ.33,775 కోట్ల కు ఎగబాకింది. సమీక్షా కాలానికి బ్యాంక్‌ వడ్డీ ఆదాయం రూ.29,583 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్‌ 3.18 శాతంగా నమోదైంది. మార్చి చివరి నాటికి బ్యాంక్‌ మొండి బకాయిలు (గ్రాస్‌ ఎన్‌పీఏ) 2.92 శాతానికి తగ్గగా.. నికర ఎన్‌పీఏలు 0.68 శాతానికి దిగివచ్చాయి. దాంతో, మార్చి త్రైమాసికంలో మొండిబాకీలు, తక్షణావసరాల కోసం కేటాయింపులు రూ.1,302 కోట్లకు తగ్గాయి. కాగా ప్రొవిజన్‌ కవరేజీ రేషియో 93.30 శాతానికి పుంజుకోగా.. మూలధన సమర్థత నిష్పత్తి 16.31 శాతానికి మెరుగుపడింది. వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.7.60 డివిడెండ్‌ చెల్లించాలని బీఓబీ బోర్డు సిఫారసు చేసింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2023-24) బీఓబీ రూ.1,27,101 కోట్ల ఆదాయంపై రూ.17,789 కోట్ల లాభం గడించింది.

Updated Date - May 11 , 2024 | 04:53 AM