డబ్ల్యూటీసీ ఫైనల్ షురూ  డ్రా అయితే గద ఎవరికి?

నేటి నుంచి వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్-2025 తుది సమరం జరగనుంది.

టెస్ట్ గద కోసం ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఈసారి ఎవరు టైటిల్ గెలుస్తారా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.

ఇంకో కప్పు కొట్టాలని కంగారూలు.. తొలి ఐసీసీ ట్రోఫీ ఎదురుచూపులకు తెరదించాలని సఫారీలు పట్టుదలతో ఉన్నారు.

ఈ మ్యాచ్‌ డ్రా అయితే ఎవర్ని విన్నర్‌గా ప్రకటిస్తారు అనేది ఆసక్తిని కలిగిస్తోంది.

ఈ మ్యాచ్ గనుక డ్రా అయితే ట్రోఫీని రెండు జట్లు పంచుకుంటాయి.

డబ్ల్యూటీసీ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఫైనల్ మ్యాచ్ డ్రా అవ్వలేదు.

వర్షం లేదా ఏదైనా కారణం వల్ల పూర్తి మ్యాచ్ సాధ్యం కాకపోతే రిజర్వ్ డే నాడు ఆడిస్తారు.