కోహ్లీ ఇంత మంచోడా..  రాహుల్ ఫ్యాన్స్ తప్పు చేశారా.. 

కేఎల్ రాహుల్-విరాట్ కోహ్లీ మధ్య ఐపీఎల్‌లో కనిపించని రైవల్రీ నడుస్తోంది. 

ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగడం, సీరియస్ అవడం, సెలబ్రేషన్ చేసే తీరు కాంట్రవర్సీగా మారింది. 

 తాము మంచి ఫ్రెండ్స్ అని.. గ్రౌండ్‌లోనూ స్నేహితులమేనంటూ కోహ్లీ మాట్లాడుతున్న ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 

డీసీతో మ్యాచ్‌ను తాను ఫినిష్ చేస్తే రాహుల్‌లా కాంతార స్టైల్‌లో సెలబ్రేట్ చేసి అతడ్ని హగ్ చేసుకునేవాడ్ని అని కోహ్లీ అన్నాడు. 

 రాహుల్-విరాట్ ఎంత మంచి ఫ్రెండ్స్ అనేది ఈ ఒక్క వీడియో చూస్తే తెలిసిపోతుందని నెటిజన్స్ అంటున్నారు.

వాళ్ల మధ్య స్నేహం తప్ప రైవల్రీ లేదని.. అనవసర రూమర్స్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాలని కోరుతున్నారు. 

కోహ్లీ-కేఎల్ ఫ్రెండ్‌షిప్ ఇలాగే కొనసాగాలని అంటున్నారు.