ఊరిస్తున్న రికార్డులు..  లార్డ్స్‌లో రచ్చ రచ్చే!

భారత నూతన సారథి శుబ్‌మన్ గిల్‌ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి.

లీడ్స్‌లో సెంచరీ, ఎడ్జ్‌‌బాస్టన్‌లో డబుల్ సెంచరీతో పాటు ఓ శతకం బాది జోరు మీదున్నాడు గిల్. అతడి కోసం కొన్ని రికార్డులు ఎదురు చూస్తున్నాయి.

గిల్ (585) మరో 18 పరుగులు చేస్తే ఇంగ్లండ్‌తో సిరీస్‌లో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలుస్తాడు.

ఇంకో 9 పరుగులు చేస్తే ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా కెప్టెన్‌గా గిల్ నిలుస్తాడు.

గిల్ మరో 128 పరుగులు చేస్తే ఇంగ్లండ్‌పై ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలుస్తాడు.

ఇంకో 190 పరుగులు చేస్తే టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా మరో రికార్డును అందుకునే చాన్స్ ఉంది.

ఈ సిరీస్‌లో మరో 3 టెస్టులు ఉన్నందున గిల్ ఊహకందని పలు రికార్డులను అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.