కోట్లు పలికిన రాకెట్..  నడాల్ క్రేజ్‌కు షాక్!

సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో అరుదైన రికార్డులు సృష్టించాడు రఫెల్ నడాల్.

22 గ్రాండ్‌స్లామ్స్ గెలుచుకున్న ఈ స్పెయిన్ బుల్.. 2 ఒలింపిక్ మెడల్స్ కూడా అందుకున్నాడు.

2024లో టెన్నిస్ ప్రపంచానికి వీడ్కోలు పలికాడు నడాల్.

ఎన్నో రికార్డులు తన పేరిట రాసుకున్న నడాల్.. ఈసారి బరిలోకి దిగకపోయినా ఓ అరుదైన ఘనత సాధించాడు. నడాల్ రిటైరైనా అతడి రాకెట్ రికార్డులు సృష్టిస్తోంది.

ఫ్రెంచ్ ఓపెన్-2017లో నడాల్ వాడిన రాకెట్ వేలంలో ఏకంగా రూ.1.34 కోట్లు పలికింది.

ఆస్ట్రేలియా ఓపెన్-2022లో రఫా వినియోగించిన రాకెట్ గత వేలంలో రూ.1.19 కోట్లు పలికింది. ఇప్పుడా రికార్డు బద్దలైంది.

ఫ్రెంచ్ ఓపెన్-2017 ఫైనల్‌లో  6-2, 6-3, 6-1తో స్టానిస్లాస్ వావ్రింకాను ఓడించి చాంపియన్‌గా నిలిచాడు నడాల్.