వాళ్లిద్దరి వల్లే ఈ సక్సెస్..  నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

భారత యువ ఆల్‌రౌండర్ నితీష్ రెడ్డి లార్డ్స్ టెస్ట్‌లో బౌలింగ్‌లో అదరగొడుతున్నాడు.

2 కీలక వికెట్లతో ఇంగ్లండ్‌ను చావుదెబ్బ తీశాడు తెలుగోడు. 

డకెట్, క్రాలేకు పెవిలియన్ దారి చూపించాడు నితీష్. ఆ తర్వాత కూడా అంతే ప్రభావవంతంగా బంతులు సంధిస్తూ వచ్చాడు. 

కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్‌లో బంతులు వేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను వణికించాడు తెలుగోడు. 

కమిన్స్‌తో పాటు భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ వల్లే తాను ఇంత బాగా బౌలింగ్ చేయగలిగానని నితీష్ తెలిపాడు.

ఇంగ్లండ్ కండీషన్స్, ఇక్కడ బౌలింగ్ చేయాల్సిన విధానం గురించి కమిన్స్ పలు సలహాలు, సూచనలు ఇచ్చాడని చెప్పుకొచ్చాడు.

మోర్కెల్‌ టిప్స్ భలేగా పనిచేశాయని పేర్కొన్నాడు. అతడితో కలసి పని చేస్తున్నప్పటి నుంచి బౌలింగ్‌లో చాలా ప్రోగ్రెస్ కనిపించిందన్నాడు నితీష్.